|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్రిస్మస్ కానుక: ఒకరోజు ముందు నుంచే సినిమాల హంగామా! ఏ సినిమా విజేత?

Published: 24-12-2025, 7:45 PM
క్రిస్మస్ కానుక: ఒకరోజు ముందు నుంచే సినిమాల హంగామా! ఏ సినిమా విజేత?
  • క్రిస్మస్ వీకెండ్ ను పురస్కరించుకుని ఈసారి ఒకరోజు ముందే సినిమాల విడుదల మొదలైంది.
  • తెలుగు, కన్నడ, మలయాళం భాషల నుంచి మొత్తం 8 చిత్రాలు రేసులో నిలిచాయి.
  • రోషన్ మేక నటించిన సినిమాతో పాటు ఆది సాయి కుమార్ ‘శంబాల’పై మంచి బజ్ ఉంది.
  • హెబ్బా పటేల్ హారర్ చిత్రం ఈ వీకెండ్ లో చూడాల్సిన సినిమాల్లో ఒకటి.

ఈ ఏడాది చివరి క్రిస్మస్ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద సందడిని పెంచింది. ఒకరోజు ముందే సినిమాల హడావుడి మొదలై, ఏకంగా 8 కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ సినిమాల పరిస్థితి, అంచనాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.

క్రిస్మస్ వీకెండ్: ఒకరోజు ముందే సినిమాల సందడి

ప్రతీ ఏడాదిలానే ఈ ఏడాది కూడా ముగింపుకి వచ్చేసింది. అన్ని సార్లూ అనుకున్నట్టు గానే ఈ ఏడాది కూడా ఇంత త్వరగా పూర్తయిపోయిందా అనే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక సినిమా లవర్స్ కి కూడా ఈ ఏడాది చివరి వీకెండ్ చివరి సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తే..

ఈసారి క్రిస్మస్ కలిసి రావడంతో ఓరోజు ముందు నుంచే సినిమాల హడావుడి స్టార్ట్ అయ్యింది. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా మన తెలుగు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కి వస్తున్నాయి. ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా అర డజను కంటే ఎక్కువే సినిమాలు వచ్చేస్తున్నాయి. దీనితో ఈ ఏడాది ముగింపు సినిమాలు ఏంటి వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా ఓ లుక్కేద్దాం రండి..

రేస్ లో మొత్తం 8 సినిమాలు ఆ 4 సినిమాలపై మాత్రం మంచి బజ్

రేసులో 8 సినిమాలు: ఏ చిత్రానికి మంచి బజ్?

డిసెంబర్ 25 క్రిస్మస్ వీకెండ్ లో భాగంగా తెలుగు, కన్నడ, మలయాళం ఇలా ముఖ్య భాషలు నుంచి మొత్తం 8 సినిమాలు అయితే ఉన్నాయి. మరి వీటిలో సాలిడ్ బజ్ ఉన్న ఆ నాలుగు సినిమాలు మాత్రం మన తెలుగు నుంచే ఉండడం విశేషం. అవన్నీ వరుసగా చూస్తే..

యువ హీరో రోషన్ మేక నటించిన ఈ సినిమా కొన్నేళ్ల కితమే అనౌన్స్ చేసినప్పటికీ దీనికి సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. నిర్మాత స్వప్న దత్, దర్శకుడు ప్రదీప్ అద్వైతం అండ్ టీం వదిలిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్ లోకి పర్ఫెక్ట్ గా వెళ్లాయి. అలాగే ప్రమోషన్స్ కూడా అంతే గ్రాండ్ మ్యానర్ లో చేస్తుండడంతో ఛాంపియన్ పట్ల ఆడియెన్స్ లో ఈ వీకెండ్ కి మంచి బజ్ సెట్టయ్యింది.

ఆది సాయి కుమార్, హెబ్బా పటేల్ చిత్రాలపై అంచనాలు

సాలిడ్ హిట్ కోసం గత కొంత కాలం నుంచి చూస్తున్న ఆది సాయి కుమార్ నటించిన ఓ ఇంట్రెస్టింగ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సినిమానే ఈ ‘శంబాల’. దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ సినిమా అనౌన్సమెంట్ వీడియో నుంచి ఇప్పుడు వరకు అంచెలంచెలుగా ఈ చిత్రం మంచి బజ్ ని ఆడియెన్స్ ని పెంచుకుంటూ వచ్చింది. ఇలా శంబాల కూడా ఇప్పుడు ఆడియెన్స్ వాచ్ లిస్ట్ లో ఈ వీకెండ్ కి చేరింది.

ఈ ఏడాది ముగింపుకి ఒక హారర్ ముగింపుని ఇవ్వాలని ఈ సినిమా మేకర్స్ ఫిక్స్ అయినట్టు ఉన్నారు. నిజానికి ఈ సినిమా క్రిస్మస్ రేస్ లో ఉందని పెద్దగా కాస్ట్ అండ్ క్రూ లాంటివి కూడా జెనరల్ ఆడియెన్స్ కి తెలియకపోవచ్చు. కానీ అలాంటి స్టేజి నుంచి హెబా పటేల్ నటించిన ఈ సినిమా ఈ వీకెండ్ లో ఆడియెన్స్ ఎదురు చూసే సినిమాల్లో డెఫినెట్ గా చూడాల్సిన ఒక సినిమాగా ఇది నిలవడం విశేషం. ఇందుకు కారణం ఇదొక హారర్ సినిమా అనే కాకుండా దీనిని మేకర్స్ ప్రమోట్ చేసిన విధానం కూడా చాలామందిలో అటెన్షన్ ని అందుకుంది. సో ఇలా ఈషా కూడా మంచి బజ్ ని సెట్ చేసుకుంది.

ఈ క్రిస్మస్ రేసులో మొత్తం 8 సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటిలో కొన్ని చిత్రాలపై మంచి బజ్ ఉండగా, మరికొన్ని సర్ ప్రైజ్ చేయవచ్చు. ఈ వీకెండ్ లో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.