|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డ్వాక్రా ఉత్పత్తుల భవితవ్యం మార్చేస్తున్న చంద్రబాబు! సంచలన నిర్ణయాలు!

Published: 11-03-2026, 12:35 PM
డ్వాక్రా ఉత్పత్తుల భవితవ్యం మార్చేస్తున్న చంద్రబాబు! సంచలన నిర్ణయాలు!
  • డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం’ బ్రాండ్ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు కోసం సీఎం చంద్రబాబు కృషి.
  • డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలు తిరిగి చెల్లిస్తారని, వారి ఉత్పత్తులకు బ్రాండ్ చాలా ముఖ్యమని సీఎం నొక్కి చెప్పారు.
  • ప్రతి జిల్లాలో ఆర్టీజీఎస్ కేంద్రం ఏర్పాటు, ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి చేయాలని సీఎం ఆదేశించారు.
  • ఉద్యోగుల సామర్థ్యం పెంపొందించడానికి ప్రతి జిల్లాలో హెచ్ఆర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని సూచన.

డ్వాక్రా ఉత్పత్తులకు ఒక బ్రాండ్ ఏర్పాటు చేయాలనీ, తద్వారా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సూచించారు. దీని ద్వారా మహిళా సాధికారత మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.

డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం’ బ్రాండింగ్ ఆవశ్యకత

అమూల్ బ్రాండ్ తరహాలోనే డ్వాక్రా ఉత్పత్తుల కోసం రూపొందించిన స్వయం బ్రాండ్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న 6వ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. తొలిరోజు చర్చలో భాగంగా వివిధ అంశాల్లో జరిగిన ప్రగతిని ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాల్లో కొన్ని కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”డ్వాక్రా, మెప్మాలోని స్వయం సహాయ సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను స్వయం పేరిట బ్రాండింగ్ చేస్తున్నాం. దీని కోసం మహిళా దినోత్సవం రోజున లోగోను కూడా ఆవిష్కరించాం. మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ ఉత్పత్తులకు ఎలాంటి బ్రాండింగ్ లభిస్తుందో… డ్వాక్రా ఉత్పత్తులకూ అదే స్థాయిలో బ్రాండింగ్ తెచ్చేలా కృషి చేస్తున్నాం. అమూల్ తరహాలోనే సహకార విధానంలో ఈ ఉత్పత్తుల మార్కెటింగ్ జరగాలి” అని సూచించారు.

నాణ్యత, ప్రమాణాలపై సీఎం చంద్రబాబు సూచనలు

” డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలను తప్పకుండా తిరిగి చెల్లిస్తారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయి. ఇంతటి క్రెడిబులిటీ ఉన్న డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. బ్రాండ్ లేకపోతే ఉత్పత్తి విలువ సగానికి తగ్గిపోతుంది. గ్లోబల్ మార్కెట్టుకు చేరేలా డ్వాక్రా ఉత్పత్తుల ప్రమాణాలు పెరగాలి. ఈ ఉత్పత్తులకు ట్రేసబిలిటి, సర్టిఫికేషన్ కూడా ఉండేలా చూడాలి. 28 జిల్లాలు… 28 బ్రాండ్లను రూపొందించి పోటీని పెంచాలి. స్వయం బ్రాండ్ ఎస్టాబ్లిష్ కావాలంటే నాణ్యతా ప్రమాణాలే అత్యంత కీలకం” అని సీఎం వెల్లడించారు.

“జిల్లా స్థాయిలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యోగుల పని తీరును విశ్లేషించుకోవాలి. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగానికీ కంప్యూటర్ అవగాహన తప్పనిసరి అర్హతగా చేర్చేలా సాధారణ పరిపాలన శాఖ చర్యలు తీసుకోవాలి. ప్రతి జిల్లాల్లో హెచ్ఆర్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా సిబ్బంది ఉద్యోగుల సామర్ధ్యాలను పెంపొందించుకోవచ్చు. ప్రణాళికా విభాగం ఆన్ లైన్ కోర్సులు తీసుకువచ్చినా ప్రాక్టికల్ నాలెడ్జి వచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి”అని సీఎం దిశానిర్దేశం చేశారు.

ఉద్యోగుల నైపుణ్యాల అభివృద్ధికి చర్యలు

రైల్వే ప్రాజెక్టుల పరంగా నిధులకు సమస్య లేదని సీఎం చంద్రబాబు …. అభిప్రాయపడ్డారు. ఇచ్చాపురం నుంచి చెన్నై వరకూ 4 లేన్ల మార్గం చేస్తున్నారని గుర్తు చేశారు. అన్ని రైల్వే స్టేషన్లనూ ఆధునీకరించే ప్రక్రియను రైల్వే శాఖ చేపట్టిందని… దీనిని అందిపుచ్చుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

“లాజిస్టిక్స్ డెవలప్మెంట్ పై ప్రధానంగా దృష్టి సారించాలి. లాజిస్టిక్స్ ప్రాజెక్టుల్లో భాగంగా పోర్టులు, ఎయిర్ పోర్టుల వద్ద పారిశ్రామిక టౌన్ షిప్‌లను అభివృద్ధి చేయాలి. ఎంఎస్ఎంఈ విధానం కింద లాజిస్టిక్స్ పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ఒక్కో జిల్లాలో 5 ఎకరాల్లో హెలీపోర్టులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి, కేంద్రం దీనికి నిధులు ఇస్తుంది” అని సీఎం పేర్కొన్నారు.

డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు బ్రాండ్ కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది మహిళా సాధికారతకు ఒక ముఖ్యమైన ముందడుగు. ఉద్యోగుల నైపుణ్యాల అభివృద్ధి కూడా పాలనలో భాగం కావాలని సిఎం అన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.