
📌 Key Points
- అల్లు శిరీష్ – నయనిక వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది!
- రిసెప్షన్‌కు హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు; నూతన దంపతులకు శుభాకాంక్షలు.
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వివాహానికి హాజరై ఆశీర్వచనాలు అందించారు.
- ఒకే ఫ్రేమ్‌లో రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్, అల్లు అరవింద్ – ఫోటో సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెళ్లికి హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అల్లు శిరీష్ పెళ్లి వేడుకలో సందడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : అల్లు శిరీష్ – నయనిక పెళ్లి నేడు ఘనంగా జరుగుతుంది. కేవలం బంధుమిత్రులు, పలువురు సన్నిహితుల మధ్య ఈ వివాహం జరుగుతుంది. చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇటీవల నిర్వహించిన రిసెప్షన్ కి వచ్చి అల్లు శిరీష్ – నయనిక జంటకు ఆశీస్సులు తెలిపారు.
ఆ సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో నేడు పెళ్ళికి హాజరయి కొత్త జంటని ఆశీర్వదించారు సీఎం రేవంత్. సీఎంతో పాటు సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా హాజరయ్యారు. పెళ్ళిలో కొత్త జంటతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, అల్లు అరవింద్ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. సీఎం రేవంత్, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో కనపడటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
ఒకే ఫ్రేమ్‌లో అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి – వైరల్ ఫోటో!
అల్లు శిరీష్, నయనిక లకు శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ ప్రముఖులు
అల్లు శిరీష్ పెళ్లి వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం హాట్ టాపిక్ అయింది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


