|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అల్లు అర్జున్ ఇక హాలీవుడ్ హీరోనా? సీఎం రేవంత్ సంచలన ప్రకటన!

Published: 12-03-2026, 12:35 PM
షాకింగ్: అల్లు అర్జున్ ఇక హాలీవుడ్ హీరోనా? సీఎం రేవంత్ సంచలన ప్రకటన!
  • అల్లు అర్జున్‌ను హాలీవుడ్‌లో చూడాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి!
  • హైదరాబాద్‌లో అల్లు అరవింద్ గారి ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి.
  • తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని హామీ.
  • హాలీవుడ్ స్థాయిలో తెలుగు సినిమాను నిలబెట్టే సత్తా అల్లు అర్జున్‌కు ఉందని ప్రశంసలు.

అల్లు అర్జున్ అభిమానులకు ఇది నిజంగా పండగ వార్త! సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అల్లు అర్జున్ హాలీవుడ్ లో రాణించాలని కోరుకున్నారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

హాలీవుడ్‌లో అల్లు అర్జున్ సత్తా చాటాలి: సీఎం

అల్లు అరవింద్ కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్‌’ (Allu Cinemas) మల్టీప్లెక్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఐటీ హబ్ కోకాపేటలో అత్యాధునిక హంగులతో దీనిని రూపొందించారు. ఈ సందర్భంగా అల్లుకుంటుంబానికి సీఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నేను సినిమా అభిమానిని. భారతదేశ సినిమా చాలా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిలో తెలుగు సినిమాదే కీలక పాత్ర. కాలేజీ రోజుల్లో నేను చాలా సినిమాలు థియేటర్లలో చూశాను. లారీల్లో వెళ్లి సినిమాలు చూసి తిరిగొచ్చేవాళ్లం. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సంవత్సరానికి నాలుగైదు సినిమాలు తీసేవారు. ఇప్పుడు స్టార్ హీరోలంతా ఏడాకొకటి, రెండేళ్లకో సినిమా తీస్తున్నారు. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు.. మధ్యతరగతి ప్రజలను సినిమా చాలా ప్రభావితం చేస్తుంది.

ఐటీ, ఫార్మాతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా ప్రభుత్వం గొప్ప పరిశ్రమగా భావిస్తోంది. చిత్రపరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. తెలుగు సినిమా ఇప్పుడు హాలీవుడ్‌తో పోటీ పడుతోంది. హాలీవుడ్ సినిమాలు హైదరాబాద్‌లో షూటింగ్ చేసేస్థాయికి తీసుకెళ్లే స్థాయికి తీసుకెళ్లాలి. దాంతో పాటు హైదరాబాద్‌లోని కృష్ణానగర్ చాలా గొప్ప వ్యక్తులను ఇండస్ట్రీకి ఇచ్చింది. అల్లు అర్జున్ ఇంకా రాణించాలి. ఇప్పటివరకు తన టాలెంట్‌ను దేశంలో ప్రూవ్ చేసుకున్నారు. రేపు హాలీవుడ్‌ వరకు వెళ్లాలి. హాలీవుడ్ సినిమాలతో పోటీ పడేలా ఆయన భవిష్యత్ ఉండాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలుగు సినిమాకు ప్రభుత్వ సహకారం: రేవంత్

అల్లు సినిమాస్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటన టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. అల్లు అర్జున్ హాలీవుడ్ ఎంట్రీ గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.