|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘కాక్రోచ్’ మూవీ టీమ్ సంచలన రిక్వెస్ట్! ఆ వర్గం ప్రేక్షకులు సినిమాకు దూరంగా ఉండాలంటూ ప్రకటన!

Published: 07-02-2026, 11:35 AM
షాకింగ్: 'కాక్రోచ్' మూవీ టీమ్ సంచలన రిక్వెస్ట్! ఆ వర్గం ప్రేక్షకులు సినిమాకు దూరంగా ఉండాలంటూ ప్రకటన!
  • శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై బి. బాపిరాజు నిర్మాణంలో రూపొందిన ‘కాక్రోచ్’ మూవీ!
  • వేశ్య, కిరాయి హంతకుడి మధ్య స్వచ్ఛమైన స్నేహంగా ‘కాక్రోచ్’ చిత్రం తెరకెక్కింది.
  • సెన్సార్ బోర్డు ‘కాక్రోచ్’ మూవీకి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది – పిల్లలకు దూరం!
  • హింసాత్మక పోరాటాలను సహజంగా చూపించడానికి రియల్ ఫైటర్స్‌ని ఎంచుకున్న మూవీ టీమ్!

పి. సునీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాక్రోచ్’. సమాజం చీత్కరించుకునే మురికి మనుషుల మధ్య నడిచే అందమైన ప్రేమ కథ ఇది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చిత్రం విడుదల గురించి ఒక సంచలన ప్రకటన చేశారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కాక్రోచ్’ మూవీ

అడ్డురోడ్‌లో పడుపు వృత్తి చేసుకొనే వేశ్యకి, ఒక కిరాయి హంతకుడికి మధ్య సాగే స్వచ్ఛమైన స్నేహం “కాక్రోచ్”. సమాజం చీత్కరించుకొనే మురికి మనుషుల మధ్య నడిచే అందమైన ప్రేమ కథగా దర్శకుడు పి. సునీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై బి. బాపిరాజు నిర్మించారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ‘కాక్రోచ్’ మూవీకి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ మంజూరు చేసింది. అలాగే సున్నిత మనస్కులు అండ్ పిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండాలని దర్శక నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ మూవీని మార్చి మొదటి వారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో ఉన్న హింసాత్మక పోరాటాలను సహజం గా చూపించడానికి రియల్ ఫైటర్స్‌ని నటులుగా ఎన్నుకోవడం జరిగినట్లు ఈ సంరద్భంగా చిత్ర బృందం చెప్పుకొచ్చారు.

సున్నిత మనస్కులకు దర్శక నిర్మాతల విజ్ఞప్తి

మార్చి మొదటి వారంలో విడుదల కానున్న చిత్రం

‘కాక్రోచ్’ మూవీ మార్చి మొదటి వారంలో విడుదల కానుంది. సున్నిత మనస్కులు, పిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండాలని దర్శక నిర్మాతలు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.