
📌 Key Points
- కాక్రోచ్ జనతా పార్టీ ఇన్ స్టా పేజీ 5 రోజుల్లో 10 మిలియన్ల ఫాలోవర్లను దాటింది.
- ట్విట్టర్ పేజీ బ్లాక్ కావడంతో బీజేపీపై భయం ఆరోపణలు వెల్లువెత్తాయి.
- ఈ ట్రెండ్ భారత్‌తో పాటు పాకిస్థాన్‌కు విస్తరించి, కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి.
- పాక్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కాక్రోచ్ ట్రెండ్‌కు మద్దతు పెరుగుతోంది.
భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండ్ ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్థాన్‌కు విస్తరించింది. సోషల్ మీడియాలో యువత సత్తా చాటుతూ, రాజకీయ పార్టీలను మించి ఫాలోవర్లను సంపాదిస్తున్న ఈ ఉద్యమం, పాక్‌లోనూ కొత్త రాజకీయ గ్రూపులకు స్ఫూర్తినిస్తోంది.
కాక్రోచ్ పార్టీ: భారత్‌లో సంచలనం
ప్రస్తుతం భారత్‌లో కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇన్ స్టా పేజీ ప్రారంభించిన ఐదు రోజుల్లోనే ఫాలోవర్ల సంఖ్య పది మిలియన్లు దాటేసింది. బీజేపీ, కాంగ్రెస్ లాంటి రాజకీయ పార్టీల అధికారిక ఫాలోవర్ల ఖాతాలను దాటేసింది. గంటగంటలకు కాక్రోచ్ పార్టీ ఇన్ స్టా పేజీ ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు ట్విట్టర్ లోనూ ఫాలోవర్లు పెరుగున్న సమయంలో ఆ పేజీని పూర్తిగా బ్లాక్ చేశారు. దీంతో కాక్రోచ్ జనతా పార్టీకి భయపడే ఆ పార్టీ పేజీని బీజేపీ డిలీట్ చేయించిందనే ఆరోపణలు వస్తున్నాయి.
తమకు భయపడే ట్విట్టర్ పేజీని లేకుండా చేశారని కాక్రోచ్ పార్టీ క్రియేటర్లు సైతం చెబుతున్నారు. ఫాలో వర్ల సంఖ్య పెరగడం జెన్ జీ సత్తా చూపించిందని అంటున్నారు. ఇక కేవలం ఇండియాలోనేకాకుండా ఇతర దేశాలకు సైతం కాక్రోచ్ ట్రెండ్ విస్తరిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ స్పూర్తితో పాకిస్థాన్ లో కాక్రోచ్ అవామీ పార్టీ పుట్టుకువచ్చింది. అంతేకుండా కాక్రోచ్ అవామీ లీగ్ అంటూ మరో గ్రూపు కూడా కనిపిస్తోంది. పాక్ లో చాలా కాలంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సరైన పాలన లేక, భారీగా పెరిగిన ధరలతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలోనే అక్కడ కాక్రోచ్ ట్రెండ్ కు మద్దతు పెరుతున్నట్టు కనిపిస్తోంది.
ట్విట్టర్ బ్లాక్: బీజేపీపై ఆరోపణలు
పాకిస్థాన్‌కు విస్తరించిన ట్రెండ్
కాక్రోచ్ ట్రెండ్ కేవలం ఒక సోషల్ మీడియా ఫినామినా కాదని, యువత తమ అసంతృప్తిని, రాజకీయ చైతన్యాన్ని వ్యక్తం చేసే ఒక శక్తివంతమైన మార్గమని స్పష్టమవుతోంది. ఇది భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.


