|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కామన్ మ్యాన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించాడు! నాగార్జున డైలాగ్‌తో బిగ్ బాస్ 9 ట్రోఫీ కైవసం, తనూజ కీలక పాత్ర!

Published: 21-12-2025, 1:44 PM
కామన్ మ్యాన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించాడు! నాగార్జున డైలాగ్‌తో బిగ్ బాస్ 9 ట్రోఫీ కైవసం, తనూజ కీలక పాత్ర!
  • కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్ గెలుచుకున్నారు.
  • రన్నరప్‌గా నిలిచిన తనూజ నిరాశ చెందినా, ఆడియెన్స్‌కు ధన్యవాదాలు తెలిపింది.
  • నాగార్జున ‘సోగ్గాడే చిన్న నాయన’ డైలాగ్‌ను ఉటంకిస్తూ కప్పు కొట్టానని కళ్యాణ్ ప్రకటించాడు.
  • తనూజ సపోర్ట్‌ను గుర్తుచేసుకుంటూ ఆమెకే తన విజయం క్రెడిట్‌ ఇచ్చాడు కళ్యాణ్.

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్ విజేతగా కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల నిలిచారు. హోస్ట్ నాగార్జున ప్రకటించగా, తనూజ రన్నరప్‌గా మిగిలింది. ఎమోషనల్ అయిన కళ్యాణ్, నాగార్జున సినిమా డైలాగ్‌ని గుర్తుచేసుకుంటూ కప్పు కొట్టానని తెలిపాడు. తన విజయంలో తనూజ పాత్రను ప్రశంసించాడు.

బిగ్‌ బాస్‌ తెలుగు 9 విజేత: ఊహించని మలుపు

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ విన్నర్‌ ఎవరో తేలిపోయింది. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే, సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగానే, ఓటింగ్‌లో దూసుకుపోతున్నట్టుగానే జరిగింది. కామన్‌ మ్యాన్‌ కళ్యాణ్‌ పడాల ఈ సీజన్‌ విన్నర్‌గా నిలిచారు. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో చివరికి తనూజ, కళ్యాణ్‌ మిగిలారు. వీరిద్దరికి నాగార్జున రూ.20లక్షల ఆఫర్‌ ఇచ్చారు. దీన్ని ఇద్దరూ తిరస్కరించారు. ఇక ఇద్దరినీ స్టేజ్‌పైకి తీసుకెళ్లిన నాగార్జున విన్నర్‌ని ప్రకటించారు. కళ్యాణ్‌ ని విన్నర్‌గా తేల్చారు.

దీంతో తనూజ రన్నరప్‌గా మిగిలింది. ఈ సందర్భంగా తనూజ మాట్లాడుతూ, ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పింది. తనకు ఇంత వరకు సపోర్ట్ చేసిన వారికి ఆమె థ్యాంక్స్ చెప్పింది. అదే సమయంలో తెలుగు ఆడియెన్స్ వల్లే తాను ఈ స్థానంలో ఉన్నానని, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అయితే విన్నర్‌ కళ్యాణ్‌ అని నాగార్జున చెప్పగానే తనూజ మొఖం వాడిపోయింది. ఒక్కసారిగా నిరాశలో మునిగిపోవడం గమనార్హం.

కళ్యాణ్ ఎమోషనల్ స్పీచ్: నాగార్జున డైలాగ్ సీక్రెట్

ఇక బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ గెలిచిన సందర్భంగా కళ్యాణ్‌ పడాల స్పందించారు. ఎమోషనల్‌ అయ్యారు. వెంటనే నేలను తాకి ముద్దు పెట్టారు. అందరికి నమస్కారాలు తెలియజేశాడు. హోస్ట్ నాగార్జున కాళ్లు పట్టుకున్నాడు. అనంతరం కళ్యాణ్‌  మాట్లాడుతూ, అగ్నిపరీక్ష షార్ట్ లిస్ట్ చేసినప్పుడే ఒక మాట చెప్పాను. నాగార్జున నటించిన `సోగ్గాడే చిన్న నాయన` సినిమా సమయంలో వస్తున్నాం, కొడుతున్నాం అని చెప్పారు. అప్పుడు హిట్‌ కొట్టారు. నేను కూడా అగ్నిపరీక్ష షార్ట్ లిస్ట్ చేసినప్పుడు అదే డైలాగ్‌ని కొట్టాను. `వస్తున్నా, కొడుతున్నా` అని, ఇప్పుడు కప్‌ కొట్టి చూపించాను. అమ్మా నాన్న నాకు ఉన్నంతలో బెటర్‌ లైఫ్‌ ఇచ్చారు. వారి వల్లే తాను ఈ స్థానంలో ఉన్నాను, ఇంకా బెటర్‌గా ఉండాల్సింది, కానీ ఇక్కడి వరకు అయినా వచ్చాను. వాళ్ల పెంపకం వల్లే ఈ స్థాయిలో ఉండగలిగాను. వాళ్లు లేనిదే నేను లేను` అని ఎమోషనల్‌ అయ్యారు కళ్యాణ్‌.

ఈ సందర్భంగా ఆయన ఇంకా మాట్లాడుతూ, నన్ను ఇంతగా ప్రేమించి ఇంత దూరం తీసుకొచ్చిన వారికి, నేను ట్రోఫీ గెలిచేందుకు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే అగ్నిపరీక్ష నుంచి నాకు ఇష్టమైన వాళ్లు, సపోర్ట్ చేసిన ప్రియా, శ్రీజ, వన్‌ అండ్‌ ఓన్లీ తనూజకి థ్యాంక్స్. నువ్వు చేయగలవు అంటూ ధైర్యాన్నిచ్చింది తనూజ, ఈ విషయాన్ని నేను ధైర్యంగా చెప్పగలను` అని తెలిపారు కళ్యాణ్‌. మొత్తంగా తనలో మార్పుకి, తాను ఇంత దూరం రావడానికి కారణం అని, ఈ సక్సెస్‌ క్రెడిట్‌ని తనూజకి ఇవ్వడం విశేషం.

విజయం వెనుక తనూజ: కళ్యాణ్ కామెంట్స్

ఈ సందర్భంగా కళ్యాణ్‌ తల్లిదండ్రులు కూడా స్టేజ్‌పైకి వచ్చారు. తమ ఆనందం పంచుకున్నారు. కళ్యాణ్‌కి సపోర్ట్ చేసిన వారికి థ్యాంక్స్ చెప్పారు. తెలిసిన వాళ్లు కొందరు, తెలియని వాళ్లు ఎందరో సపోర్ట్ చేశారని, వారికి పేరు పేరున ధన్యవాదాలు, కళ్యాణ్‌ విన్నర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అయితే విన్నర్‌ అయిన కళ్యాణ్‌కి ప్రైజ్‌ మనీ, కారు గిఫ్ట్ తోపాటు మరో బంపర్‌ ఆఫర్‌ తగిలింది. రోఫ్‌ కంపెనీ వాళ్లు ఐదు లక్షలు ప్రైజ్‌ మనీ ఇవ్వడం విశేషం.

మొత్తానికి, ఒక సామాన్యుడు బిగ్‌ బాస్‌ టైటిల్ గెలిచి తన కల నెరవేర్చుకున్నాడు. ఈ విజయంలో తనూజ సపోర్ట్‌ను గుర్తుచేసుకుంటూ, తల్లిదండ్రుల పెంపకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కళ్యాణ్ తన ప్రయాణాన్ని విజయవంతంగా ముగించాడు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.