|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీని ఊపేస్తున్న కానిస్టేబుల్ కనకం.. మిస్టరీ హారర్ థ్రిల్లర్ కు ఆడియన్స్ ఫిదా.. సీజన్ 2 ఎప్పుడంటూ పోస్టులు

Published: 18-08-2025, 1:24 AM
ఓటీటీని ఊపేస్తున్న కానిస్టేబుల్ కనకం.. మిస్టరీ హారర్ థ్రిల్లర్ కు ఆడియన్స్ ఫిదా.. సీజన్ 2 ఎప్పుడంటూ పోస్టులు

మిస్టరీ, హారర్, థ్రిల్లర్ అంశాలతో నిండిన కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ఓటీటీలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రోజురోజుకు పెరుగుతున్న ప్రేక్షకుల ఆదరణతో సిరీస్ రికార్డులు సృష్టిస్తోంది.

Key Points

1

కానిస్టేబుల్ కనకం ఓటీటీలో అద్భుతమైన విజయం సాధించింది.

2

మిస్టరీ, హారర్, థ్రిల్లర్ అంశాలతో ఆకట్టుకుంటోంది.

4

సిరీస్ సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

రికార్డు స్థాయిలో వ్యూస్

ఓటీటీలో థ్రిల్లర్స్ ను ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఎంతో మంది. ఎప్పుడెప్పుడు మంచి థ్రిల్లర్ మూవీ లేదా సిరీస్ వస్తుందోనని వెయిట్ చేస్తుంటారు. అలాంటి సిరీస్ వస్తే వదులుతారా? ఇప్పుడు కానిస్టేబుల్ కనకం సిరీస్ కు వచ్చిన రెస్పాన్స్ కు ఇదే కారణం. మిస్టరీ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ఓటీటీని షేక్ చేస్తోంది. రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్ సీజన్ 2 అంటూ ఆడియన్స్ అడుగుతున్నారు.

కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ఆగస్టు 14న ఓటీటీ లో రిలీజైంది. ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ ఫస్ట్ డే నుంచే ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మంచి కంటెంట్ ఉన్న ఒరిజినల్ సిరీస్ లు అందించే ఈటీవీ ఈ కానిస్టేబుల్ కనకంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇందులో వర్ష బొల్లమ్మ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ సిరీస్ ఇప్పటికే 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినట్స్ తో అదరగొడుతోంది.

ప్రేక్షకుల స్పందన

సస్పెన్స్, హారర్, మిస్టరీతో అదిరిపోయే థ్రిల్ పంచే కానిస్టేబుల్ కనకం ఆడియన్స్ ను కట్టి పడేస్తోంది. ఈ సిరీస్ చూసిన వాళ్లు అదిరిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా ట్విస్ట్ లకు మైండ్ బ్లాక్ అయిందని చెబుతున్నారు. అలాగే సీజన్ 2 ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. సస్పెన్స్ కు త్వరగా తెరదించండని కోరుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

‘‘కానిస్టేబుల్ కనకం సూపర్. ప్రతి ఎపిసోడ్ కు ట్విస్ట్ అండ్ టర్న్స్. చంద్రిక ఎక్కడ? సీజన్ 2 ఎప్పుడు? థ్యాంక్స్ మావ. ఈటీవీ విన్ మంచి సిరీస్, మూవీస్ ఇస్తున్నావ్. పూర్తి సంతృప్తి చెందా’’ అని ఓ యూజర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు.

సీజన్ 2 కోసం డిమాండ్

‘‘నా కుటుంబంతో కలిసి ఇప్పుడే కానిస్టేబుల్ కనకం చూశా. ఈ సిరీస్ చూశాక మా అమ్మ రియాక్షన్ ఇదే. చంద్రికను ఎవరు కిడ్నాప్ చేశారు? ఆమెకు ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఆత్రుతగా ఎదురు చూస్తుంది. ఈటీవీ విన్ ప్లీజ్ వీలైనంత త్వరగా సీజన్ 2ను రిలీజ్ చేయండి’’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు.

ఒరిజినల్ కంటెంట్ తో ఈటీవీ విన్ అదరగొడుతోంది. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ అంటూ ఫ్యామిలీ డ్రామాతో అదరగొట్టింది. ఆ తర్వాత అనగనగా అనే మూవీతో ఆడియన్స్ ను ఏడిపించేసింది. ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) సిరీస్ తో ఇంటర్మీడియట్ స్టూడెంట్ల కష్టాలు, ర్యాంకుల కోసం తల్లిదండ్రుల ఒత్తిడి తదితర అంశాలను మనసుకు హత్తుకునేలా చూపించింది. ఇప్పుడు కానిస్టేబుల్ కనకంతో థ్రిల్ పంచుతుంది.

కానిస్టేబుల్ కనకం సిరీస్ ఓటీటీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రేక్షకుల అంచనాలను అందుకున్న ఈ సిరీస్ సీజన్ 2 కోసం ఎదురు చూడటం తప్పదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.