
📌 Key Points
- పవన్ కళ్యాణ్ గురించి స్టాండప్ కమెడియన్స్ అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి.
- కమెడియన్ అనుదీప్ పవన్, నిహారికల గురించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాడు.
- మరొక కమెడియన్ రఫిక్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
- రఫిక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ గురించి స్టాండప్ కమెడియన్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనుదీప్ క్షమాపణ చెప్పినప్పటికీ, రఫిక్ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాన్ని రాజేశాయి.
అనుదీప్ వ్యాఖ్యలు, క్షమాపణ
Pawan Kalyan: సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి ఇటీవల స్టాండప్ కమెడియన్స్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. నిన్నగాక మొన్న ఒక స్టాండ్ కమెడియన్ అనుదీప్ (Anudeep)ఉపాసన రాంచరణ్ గురించి మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ అలాగే నిహారికల విడాకుల గురించి వారి వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. ఇలా కామెడీ పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి కించపరుస్తూ మాట్లాడటంతో మెగా అభిమానులు ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు.
ఈ నేపథ్యంలోనే కమెడియన్ అనుదీప్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడమే కాకుండా బహిరంగక్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఇక అనుదీప్ రెండు రోజులు పరారీలో ఉన్నప్పటికీ ఈయన చివరికి పవన్ కళ్యాణ్ నిహారిక గురించి చేసిన వ్యాఖ్యల పట్ల బహిరంగంగా క్షమాపణలు తెలియజేస్తూ ఒక వీడియో చేశారు. అయితే ఈయనపై కేసు నమోదు కావడంతో ప్రయాగ్ రాజ్ లో తన తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళిన అనుదీప్ ను కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇలా అనుదీప్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యల పట్ల అరెస్టు కావడంతో మిగిలిన స్టాండప్ కమెడియన్స్ ఈ విషయంపై మాట్లాడరని అందరూ భావించారు కానీ తాజాగా మరొక స్టాండప్ కమెడియన్ రఫిక్ (Rafiq)సైతం పవన్ కళ్యాణ్ గురించి ఆయన పెళ్లిళ్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని అందరూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటారు కానీ నేను మాత్రం ఆయనని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ ప్రజలు పవన్ కళ్యాణ్ ని రిజెక్ట్ చేయడం కాదు ఆయన ముగ్గురు పెళ్ళాలు కూడా తనని రిజెక్ట్ చేశారు అంటూ పవన్ గురించి, ఆయన వైవాహిక జీవితం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
రఫిక్ సంచలన ఆరోపణలు
పవన్ కళ్యాణ్ పై ఎవరు ఈ దాడి చేయిస్తున్నారు?? మొన్న అనుదీప్, ఈరోజు రఫిక్…
Stand up comedian Rafiq made derogatory comments on #PawanKalyan marriage & his wife! pic.twitter.com/3ix1qfJ9L6
— Narendra News (@Narendra4News) April 15, 2026
సోషల్ మీడియాలో ఆగ్రహం
ప్రస్తుతం స్టాండప్ కమెడియన్ రఫిక్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వీరి వ్యవహార శైలి పై మండిపడుతున్నారు. ఇలా స్టాండప్ కమెడియన్స్ మొత్తం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వెనుక గల కారణం ఏమిటి? పవన్ కళ్యాణ్ పై కుట్రలో భాగంగానే ఇలా జరుగుతోందా? స్టాండప్ కమెడియన్స్ వెనుక ఎవరి హస్తం ఉంది? అంటూ ఎంతోమంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఏపీ హోమ్ మినిస్టర్ వీటిపై దృష్టి సారించి వీరి పట్ల చర్యలు తీసుకోవాలి అంటూ మెగా అభిమానులు ఈ వీడియోలపై ఘాటుగా స్పందిస్తున్నారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ పై ఇద్దరు స్టాండప్ కమెడియన్లు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.


