
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలో అమిర్ ఖాన్ నటించడం అధికారికంగా ఖరారైంది. అమిర్ ఖాన్ ‘దహా’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టులో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
Key Points
రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా ఆగస్టులో విడుదల.
అమిర్ ఖాన్ కూలీ సినిమాలో 'దహా' పాత్రలో నటిస్తున్నారు.
సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
కూలీ సినిమా విడుదల తేదీ
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ నటిస్తున్నారని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అమిర్ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో దహా అనే పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలైన అమిర్ ఖాన్ లుక్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కూలీ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.
అమిర్ ఖాన్ పాత్ర వివరాలు
అంచనాలు పెరుగుదల
అమిర్ ఖాన్ చేరికతో కూలీ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆగస్టులో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.


