
📌 Key Points
- సంతోష్ శోభన్, మానస వారణాసిల రొమాంటిక్ కెమిస్ట్రీతో ‘నా ప్రాణమా’ సాంగ్ విడుదల!
- ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ డే కానుకగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రిలీజ్ అవుతోంది.
- యూవీ క్రియేషన్స్ సమర్పణలో అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం.
- సెన్సార్ బోర్డ్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీకి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది.. రన్ టైమ్ 2 గంటల 1 నిమిషం.
సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుంచి విడుదలైన ‘నా ప్రాణమా’ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ సాంగ్‌తో యూత్‌లో మంచి బజ్ క్రియేట్ చేసింది.
యూవీ క్రియేషన్స్ నుంచి రొమాంటిక్ ట్రీట్!
యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santosh Soban) చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అందులో భాగంగానే కపుల్ ఫ్రెండ్లీ (Couple Friendly) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అశ్విన్ చంద్రశేఖర్(Ashwin Chandrashekhar) దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుండగా.. అజయ్ కుమార్ రాజు పి నిర్మించారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన మానస వారణాసి (Manasa Varanasi) నటించింది. ఇప్పటికే కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వాలెంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న కపుల్ ఫ్రెండ్లీ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ నా ప్రాణమా సాంగ్ రిలీజ్ అయింది. హీరో హీరోయిన్ రొమాన్స్‌తో సాగే ఈ పాట లిరీక్స్ లవ్ బర్డ్స్‌ను ఆకట్టుకున్నాయి. కాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ A ‘A'(Adults Only) సర్టిఫికెట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే అ మూవీ రన్ టైమ్ 2 గంటల 1 నిమిషం (121 నిమిషాలు).
‘నా ప్రాణమా’ సాంగ్‌తో హీటెక్కిన యూత్!
వాలెంటైన్స్ డేకి కపుల్స్ కోసం పర్ఫెక్ట్ మూవీ!
సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ఫిబ్రవరి 13న విడుదల కానుంది. ఈ సినిమా యూత్‌కి కనెక్ట్ అయ్యేలా రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఉండబోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


