|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బర్త్‌డే స్పెషల్‌గా ‘కపుల్ ఫ్రెండ్లీ’ నుంచి హీరో పోస్టర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న సింపుల్ లుక్

Published: 12-07-2025, 8:45 PM
బర్త్‌డే స్పెషల్‌గా ‘కపుల్ ఫ్రెండ్లీ’ నుంచి హీరో పోస్టర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న సింపుల్ లుక్

సంతోష్ శోభన్ మరియు మానస వారణాసి జంటగా నటిస్తున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా నుంచి హీరో పోస్టర్ విడుదలైంది. సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది.

Key Points

1

సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా కపుల్ ఫ్రెండ్లీ పోస్టర్ విడుదల

2

సింపుల్ లుక్‌లో హీరో ఆకట్టుకుంటున్నాడు

4

తాజా పోస్టర్‌కు మంచి స్పందన వస్తుందని అంచనా

కపుల్ ఫ్రెండ్లీ నుంచి కొత్త పోస్టర్

సంతోష్ శోభన్(Santhosh Sobhan), మానస వారణాసి(Manasa Varanasi) జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly). దీనికి ద‌ర్శ‌కుడు అశ్విన్ చంద్ర‌శేఖ‌ర్(Aswin Chandrashekar) డైరెక్ట్ చేస్తుండగా.. యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రానికి అజ‌య్ కుమార్.పి కో ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే చెన్నై బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మూవీటీమ్.

ఈరోజు సంతోష్ శోభన్ పుట్టిన రోజు సందర్భంగా అతనికి విష్ చేస్తూ.. ‘కపుల్ ఫ్రెండ్లీ బృందం నుండి సంతోష్ శోభన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఈ మూవీ త్వరలో తెలుగు & తమిళంలో రానుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో హీరో హెల్మెట్ పెట్టుకుని ముందు ఓ బ్యాగ్ పెట్టుకుని ఓ సాధారణ ఫ్యామిలీ మ్యాన్‌లా కనిపిస్తూ బైక్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక అతని పక్కన ఆటో, వెనుక కూడా ఆటో, బైక్స్ ఉన్నాయి. ఫైనల్‌గా సింపుల్ లుక్‌లో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. Link

సంతోష్ శోభన్ సింపుల్ లుక్

తెలుగు, తమిళ భాషల్లో విడుదల

చివరగా, సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.