
జీ5 మరియు ఈటీవీ విన్ మధ్య ఒరిజినల్ కంటెంట్ వివాదం రేగుతోంది. విరాటపాలెం మరియు కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్‌ల మధ్య సారూప్యతపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ వివాదంపై జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ స్పందించారు.
Key Points
ఈటీవీ విన్ మరియు జీ5 మధ్య ఒరిజినల్ కంటెంట్ వివాదం.
కానిస్టేబుల్ కనకం మరియు విరాటపాలెం సిరీస్‌ల మధ్య సారూప్యత ఆరోపణలు.
కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ వివరణ.
జీ5 తమ ఒరిజినాలిటీపై గట్టిగా నమ్మకం వ్యక్తం చేసింది.
ఈటీవీ విన్ మరియు జీ5 మధ్య వివాదం
ఓటీటీ వేదికలు అయిన జీ5, ఈటీవీ విన్ మధ్య ఎవరిది ఒరిజినల్ కంటెంట్ అనే గొడవ నడుస్తోంది. రీసెంట్‌గా జూన్ 27 నుంచి జీ5 లో తెలుగు హారర్ వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే, విరాటపాలెం ట్రైలర్ చూసిన కానిస్టేబుల్ కనకం మేకర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమ స్టోరీని కాపీ కొట్టి విరాటపాలెం తెరకెక్కించారని కానిస్టేబుల్ కనకం దర్శకనిర్మాతలు ఆరోపించారు. దీనిపై కోర్టులో కూడా కేసు వేసినట్లుగా చెప్పారు. ఈటీవీ విన్ ఓటీటీ ఒరిజినల్ సిరీస్‌గా కానిస్టేబుల్ కనకం రూపొందుతోంది. విరాటపాలెం ట్రైలర్ వచ్చిన కొన్ని రోజులకే తమదే ఒరిజినల్ గన్ అంటూ కానిస్టేబుల్ కనకం పోస్టర్‌ను రిలీజ్ చేసింది ఈటీవీ విన్ ఓటీటీ.
ఇక జూన్ 27న విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ రిలీజ్ అయి సక్సెస్ అయినట్లుగా శనివారం (జూన్ 28) మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించింది జీ5 ఓటీటీ సంస్థ. ఈ సక్సెస్ మీట్‌లో జీ5 ఓటీటీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ కామెంట్స్ ఈటీవీ విన్ వర్సెస్ జీ5 అన్నట్లుగా ఉన్నాయి.
కానిస్టేబుల్ కనకం మరియు విరాటపాలెం
జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ మాట్లాడుతూ .. “నేను స్టేజ్ మీద ఎక్కువగా మాట్లాడను. జీ తెలుగు సంస్థకు ఇది 20వ వసంతం. ఈ ప్రయాణంలో మాకు మీడియా ఎంతో అండగా నిలబడింది. మా టీం సహకారం వల్లే ఇంత సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నాం” అని అన్నారు.
“మేం వంద శాతం ఒరిజినల్ కంటెంట్, షోలను తీసుకువచ్చాం. మేం ఎన్నో ఐకానిక్ షోలను చేశాం. మేం వేసిన బాటలో ఎంతో మంది నడిచారు. మేం ఎన్నో ఒరిజినల్ ఐడియాస్‌ను క్రియేట్ చేశాం. ‘ఆరంభం ఒక్క అడుగు’తో అంటూ ఇక్కడి వరకు వచ్చాం. ఓటీటీ సంస్థల్లో మేం స్టాండర్డ్స్‌ను సెట్ చేశాం” అని అనురాధ తెలిపారు.
“గాలివాన, ఏటీఎం , పరువు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, పులి మేక ఇలా ప్రతీ చోటా మేం ఒరిజినల్ కంటెంట్‌తోనే వచ్చాం. పులి మేక అనేది ఫస్ట్ ఫీమేల్ కాప్ స్టోరీ. ఆ తరువాత ఎన్నో కాప్ స్టోరీలు వచ్చాయి. ఓటీటీల్లో ఎన్నో కాప్ స్టోరీలున్నాయి. ఓ కాప్ స్టోరీ కావాలని నేనే దివ్యను అడిగాను. అప్పుడే దివ్య సొంతంగా ఈ కథను రాసుకున్నారు” అని వివరణ ఇచ్చారు అనురాధ.
అనురాధ కామెంట్స్
“మేం జరిగిన వివాదం గురించి మాట్లాడం. మా కంపెనీ పాలసీని దాటి మేం మాట్లాడం. వ్యవహారం కోర్టులో ఉన్నప్పుడు మేం ఏమీ మాట్లాడకూడదు. ఇంత నెగెటివిటీ ఉన్నా కూడా మా సిరీస్‌కు ఇంతటి రెస్పాన్స్ వచ్చింది. మేం ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ, హద్దుల్ని చెరిపి వేస్తూ వచ్చాం” అని అనురాధ చెప్పారు.
“ఇంకా ఇలాంటి పాత్ బ్రేకింగ్ కంటెంట్‌తో వస్తూనే ఉంటాం. సత్యమేవ జయతే. మాకు మా కాంపిటీటర్స్ పట్ల ఎంతో గౌరవం ఉంది. మా సంస్థను కించపరిచేలా మాట్లాడిన వారిపై పరువు నష్టం దావా వేశాం. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది” అని జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ చెప్పుకొచ్చారు.
కోర్టు విచారణ నేపథ్యంలో జీ5 తమ ఒరిజినల్ కంటెంట్‌పై నమ్మకాన్ని వ్యక్తం చేసింది. వివాదం తీవ్రంగా ఉన్నప్పటికీ, విరాటపాలెం సిరీస్‌కు మంచి స్పందన లభించిందని అనురాధ పేర్కొన్నారు.


