
‘కోర్టు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ వంటి స్టార్ డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. తన భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆమె ఇచ్చిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Key Points
కోర్టు సినిమాతో పేరు తెచ్చుకున్న శ్రీదేవి
గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్లు ఆమె రీల్స్ చూసి ఆకర్షించబడ్డారు
వారు తక్షణ ప్రాజెక్టులు కాదు, కానీ భవిష్యత్తులో ఆమెతో పనిచేయాలని ఆశిస్తున్నారు
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా శ్రీదేవి సినీరంగంలో అడుగుపెట్టింది
కోర్టు సినిమాతో శ్రీదేవి విజయం
చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ (Court). నేచురల్ స్టార్ నాని (Nani) సమర్పణలో ప్రియదర్శి (Priyadarshi), హర్ష రోషన్, శ్రీదేవి (Sridevi), శివాజీ (Sivaji), రోహిణి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ మార్చి 14న వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. కొత్త డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో నటీనటులు అందరికి మంచి గుర్తింపు వచ్చింది. వారిలో శ్రీదేవి ఒకరు. ఏపీకి చెందిన ఈమె.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే కోర్ట్‌లో కూడా ఆమెకు అవకాశం వచ్చింది.
స్టార్ డైరెక్టర్ల నుండి ఆఫర్లు
ఇక మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న శ్రీదేవి ప్రస్తుతం.. వరుస ఇంటర్వ్యూస్ ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ పలు రీల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్ బ్యూటీ.. తనకు వచ్చిన ఆఫర్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) నా దగ్గరికి వచ్చి నా రీల్స్ తనకు నచ్చాయని చెప్పారు. తర్వాత హరీష్ శంకర్ (Harish Shankar) కూడా నన్ను సంప్రదించారు.. అయితే.. తక్షణ ప్రాజెక్టుల కోసం కాదు.. కానీ వారు నేను ఎదగాలని ఎదురు చూస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
రీల్స్ ద్వారా సినీ ప్రయాణం
“Director #GopichandMalineni approached me, saying he liked my reels. Later, #HarishShankar garu also reached out — not for any immediate projects, but they’re waiting for me to grow.” – Sridevi, #COURT Fame ✨ pic.twitter.com/Svn3NvZsXB
శ్రీదేవి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి, తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, భవిష్యత్తులో మరింత పెద్ద సినిమాలలో నటించాలని ఆశిస్తోంది. గోపీచంద్ మలినేని మరియు హరీష్ శంకర్ లాంటి దిగ్గజ దర్శకుల అంచనాలను అందుకోవడానికి ఆమె కృషి చేస్తోంది.


