|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

CP Sajjanar: 21 వేల సినిమాలు.. రూ.20 కోట్ల సంపాదన.. 50 లక్షల మంది డాటా.. షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్‌

Published: 17-11-2025, 2:11 AM
CP Sajjanar: 21 వేల సినిమాలు.. రూ.20 కోట్ల సంపాదన.. 50 లక్షల మంది డాటా.. షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్‌

పైరసీ కట్టడిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్‌రాజు భేటీ అయ్యారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడి షాకింగ్ వివరాలు వెల్లడించారు. 21 వేల సినిమాలు, రూ.20 కోట్ల సంపాదన గురించి తెలిపారు.

Key Points

1

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్, 65 మిర్రర్ వెబ్‌సైట్లు నిర్వహణ.

2

రవి హార్డ్‌డిస్క్‌లో 21 వేల సినిమాలు, 1972 గాడ్‌ఫాదర్ నుండి 2025 ఓజీ వరకు ఉన్నాయి.

4

50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా కలిగి ఉండటం చాలా ప్రమాదకరమని సజ్జనార్ వెల్లడి.

సీపీ సజ్జనార్‌తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ

CP Sajjanar: టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్‌రాజు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌తో(CP Sajjanar) భేటీ అయ్యారు. ఇటీవల ఐబొమ్మ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సినీపెద్దలు సీపీ సజ్జనార్‌తో అయ్యారు. ఈ భేటీ అనంతరం సీపీ సజ్జనార్‌ మీడియాతో మాట్లాడారు. “పైరసీ కారణంగా సినీ రంగానికి చాలా నష్టం జరిగింది. దీన్ని కట్టడి చేయడంలో భాగంగానే ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేయడం జరిగింది. రవిపై ఇప్పటికే ఐటీ యాక్ట్‌, కాపీ రైట్‌ యాక్ట్‌ 4 కేసులు నమోదు అయ్యాయి. ఈ పైరసీకి సంబంధించి ఇప్పటికే శివరాజ్‌, ప్రశాంత్‌ లను కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇమ్మడి రవి కేవలం పైరసీ ద్వారానే కాకుండా బెట్టింగ్‌ యాప్‌లను సైతం ప్రమోట్‌ చేస్తున్నాడు.

ఐబొమ్మ వెబ్‌సైట్ పైరసీ వ్యవహారం – షాకింగ్ వివరాలు

Priya Prakash Varrier: ప్రియా ప్రకాష్ వారియర్.. వారేవా నీ గ్లామర్.. ఫొటోలు

ఇమ్మడి రవి సృష్టించిన మిర్రర్ వెబ్‌సైట్లు, డేటా

దానివల్ల చాలా మంది అమాయకులు చనిపోయారు. వెబ్ సైట్ క్రియేట్ చేయడంలో రవి ఆరితేరాడు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్‌ చేస్తే.. కొత్త సైట్‌ను తయారు చేసేవాడు. అలా ఏకంగా 65 మిర్రర్‌ వెబ్‌సైట్లు అతను నిర్వహించాడు. అతడి దగ్గర దొరికిన హార్డ్‌ డిస్క్‌లో 21 వేల సినిమాలు ఉన్నాయి. అందులో, 1972లో రిలీజ్ అయిన గాడ్‌ఫాదర్‌ నుంచి 2025 ఓజీ వరకు ఉన్నాయి. ఈ వెబ్ సైట్ ద్వారా రవి ఏకంగా రూ.20 కోట్లు సంపాదించాడు. ఐబొమ్మను యూస్ చేస్తున్న దాదాపు 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా అతను దగ్గర ఉంది. ఇంత డేటా అతడి వద్ద ఉండటం చాలా ప్రమాదకరం”అంటూ తెలిపాడు సజ్జనార్‌.

ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ వల్ల సినీ రంగానికి భారీ నష్టం వాటిల్లినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఇమ్మడి రవి వద్ద ఉన్న భారీ డాటా, అతని అక్రమ సంపాదన తీవ్రమైన ఆందోళన కలిగించే అంశాలని స్పష్టం చేశారు. పైరసీ నియంత్రణకు చర్యలు కొనసాగుతాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.