
బుల్లితెర నటి సత్య దేవరాజన్ తాజాగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె ఇటుకలు మోస్తుండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘ధనం’ సీరియల్‌లోని ఆమె పాత్రకు సంబంధించినదే ఈ వీడియో.
Key Points
సత్య దేవరాజన్ నటించిన తాజా వీడియో వైరల్ అవుతోంది.
వీడియోలో ఆమె ఇటుకలు మోస్తున్నట్లు చూపించారు.
నెటిజన్లు ఆమె పరిస్థితికి సానుభూతి చూపుతున్నారు.
‘ధనం’ సీరియల్‌లో ఆమె పాత్ర నేపథ్యం వీడియోకు కారణం.
సత్య దేవరాజన్ వైరల్ వీడియో
బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య దేవరాజన్(Sathya devarajan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ఎన్నో సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలాగే అందం, అభినయంతో ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస సీరియల్స్ చేస్తూ అలరిస్తు ఉంది. ఈ క్రమంలో ఈ చిన్నదికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది.
అందులో సెట్‌లో తాను భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేసేందుకు రెడీ అవుతున్న వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబధించిన వీడియో సోషల్ మీడియ(Social Media)లో వైరల్‌గా మారగా.. నెటిజన్లు అయ్యో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తమిళంలో ప్రసారమయ్యే ‘ధనం’(Dhanam) సీరియల్‌లో తన భర్త ఆటో నడిపిస్తాడు. అయితే తన భర్త సడెన్‌గా మరణించడంతో కుటుంబ బాధ్యతలు తీసుకుంటుంది సత్య. ఇందులో భాగంగానే ఇటుకలు మోస్తూ కనిపించింది ఈ బ్యూటీ. Link
ఇటుకలు మోస్తున్న హీరోయిన్
నెటిజన్ల సానుభూతి
సత్య దేవరాజన్ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. నెటిజన్ల సానుభూతి ఆమె నటనకు, పాత్రకు అద్దం పడుతోంది.


