
సంగీత ప్రేమికులకు శుభవార్త! స్వచ్ఛమైన తెలుగు సంగీతానికి కొత్త వేదికగా క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ అడుగుపెట్టింది. వారి తొలి ప్రయత్నం ‘జగములే’ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
Key Points
స్వచ్ఛమైన తెలుగు సంగీతంతో కూడిన కొత్త ప్లాట్‌ఫామ్ 'క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్' ప్రారంభం.
‘జగములే’ పాటతో తెలుగు ఇండిపెండెంట్ మ్యూజిక్‌కు కొత్త దిశ.
నిహాల్ కోదాటి, నేహా పఠాన్ జంటగా నటించిన ‘జగములే’ పాట యూట్యూబ్‌లో విడుదల.
నరేన్ రెడ్డి సంగీతం, సుభాష్ సాకే సాహిత్యం, కపిల్ కపలన్ గానం.
క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ ప్రారంభం
సంగీతంతో ఎంతోమంది ప్రశాంతతను ఫీల్ అవుతుంటారు. ఇటీవల కాలంలో వివిధ భాషల్లో ఎన్నో మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్ సంగీతాన్ని అందిస్తున్నాయి. నేటి యువతరం సింగర్స్ , మ్యూజిషియన్స్‌గా పేరు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే, అలాంటి యువ ప్రతిభావంతులైన బృందంతో కలిసి స్వచ్ఛమైన సంగీతాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్. తెలుగు సంగీత ప్రపంచంలో స్వతంత్ర, ఒరిజినల్ కంటెంట్ చాలా అరుదుగా వస్తున్న ఈ రోజుల్లో కొత్తతరం మ్యూజిక్ అండ్ కంటెంట్ ప్లాట్‌ఫామ్‌గా క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ మార్కెట్ రంగంలోకి అడుగుపెట్టింది.
టాలెంటెడ్ యంగ్‌స్టర్స్ టీమ్‌తో కలిసి స్వచ్ఛమైన కథలతో, ఆత్మను తాకే సంగీతాన్ని సృష్టిస్తున్నామని, అదే తమ లక్ష్యమని క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బృందం పేర్కొంది. మా దృష్టి కేవలం సంగీతంపైనే కాకుండా దానిని ప్రతిబింబించే బహుముఖ దృశ్య అనుభూతులు షార్ట్-ఫామ్ కంటెంట్ రూపాల్లో కొత్త రుచిని తీసుకురావడంపై కూడా ఉందని తెలిపారు.
‘జగములే’ పాట విడుదల
సినిమాలు, కథల రూపాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో తాము సృజనాత్మకతకు ప్రోత్సాహం ఇచ్చి నేటి ఆడియెన్స్‌కు మరింత దగ్గరిగా చేరాలని ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. వారి ప్రయాణంలో తొలి అడుగుగా జగములే సాంగ్ రిలీజ్ చేసినట్లు క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ (Kreative Launchpad) మేకర్స్ చెప్పుకొచ్చారు.
“జగములే సాంగ్ తెలుగు ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి కొత్త దిశను చూపుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ మా జగములే తెలుగు ఇండిపెండెంట్ సాంగ్ సంగీత భవిష్యత్తును తీర్చిదిద్దే మా ప్రయాణనికి కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో ఇంకా ఎన్నో నిజమైన పాటలు, ప్రేరణాత్మక కథలు ఆడియెన్స్ కోసం రాబోతున్నాయి” అని క్రియేటివ్ లాంచ్‍ప్యాడ్ పేర్కొంది.
తెలుగు సంగీతానికి కొత్త దిశ
యూట్యూబ్ లో రెండు రోజుల క్రితం విడుదలైన జగములే సాంగ్‌లో హీరో నిహాల్ కోదాటి, నేహా పఠాన్ జంటగా నటించారు. ఈ పాటను నరేన్ రెడ్డి కంపోజ్ చేశారు. అలాగే, సుభాష్ సాకే సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్ కపిల్ కపలన్ ఆలపించారు.
ఇక ఈ జగములే పాటకు డైరెక్టర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా జయ్‌రాజ్ నాయుడు పనిచేశారు. సంకీర్త్ కొండ, నాగేష్ కైత నిర్మాతలుగా వ్యవహరించగా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అభినయ్ దండా ఉన్నారు. ఆగస్ట్ 21న యూట్యూబ్‌లో క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ ఛానెల్‌లో రిలీజ్ అయిన జగములే సాంగ్ మంచి వ్యూస్ అందుకుంటోంది.
క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ యొక్క ‘జగములే’ పాట తెలుగు ఇండిపెండెంట్ సంగీతానికి కొత్త అధ్యాయాన్ని తెరుస్తుందని ఆశిద్దాం. భవిష్యత్తులో మరింత ప్రేరణాత్మక కంటెంట్‌ను ఆశిస్తున్నాం.


