
నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైంది.
Key Points
బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా వరల్డ్ టీవీ ప్రీమియర్‌కు సిద్ధం.
జులై 13న స్టార్ మా ఛానల్‌లో సాయంత్రం 6 గంటలకు ప్రసారం.
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై భారీ వ్యూస్ సొంతం చేసుకున్న చిత్రం ఇది.
సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రం.
డాకు మహారాజ్ టీవీ ప్రీమియర్ వివరాలు
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో వచ్చిన మూవీ ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అలాగే ఈ మూవీలో బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఐటెం సాంగ్‌లో చిందులేసి మెప్పించింది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఫిబ్రవరి 21నుంచి తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై.. అక్కడ కూడా మంచి వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది ‘స్టార్ మా’ ఛానెల్. ‘వేటగాడు.. ‘డాకు మహారాజు’ జులై 13 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ ఆదివారం సాయంత్రం 6గంటలకు.. స్టార్ మాలో మాత్రమే చూడండి’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతుండగా.. ‘జై బాలయ్య’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link
ఎప్పుడు, ఏ ఛానల్‌లో?
సినిమా విజయం మరియు ప్రజాదరణ
చివరగా, డాకు మహారాజ్ సినిమా టీవీ ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. స్టార్ మాలో ప్రసారం కానున్న ఈ చిత్రాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి.


