
📌 Key Points
- ఛాంపియన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
- హీరో రోషన్ మేక తన తండ్రి శ్రీకాంత్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
- ‘నాన్న నువ్వే నా ఐడెంటిటీ’ అంటూ రోషన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.
- ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
ఛాంపియన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో రోషన్ మేక చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన తండ్రి శ్రీకాంత్ గురించి మాట్లాడుతూ ‘నాన్న నువ్వే నా ఐడెంటిటీ’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రోషన్ మేక భావోద్వేగ ప్రసంగం
Champion Event : ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్ మేక నటిస్తున్న సినిమా ఛాంపియన్. డిసెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ తరుణంలోని చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కు రామ్ చరణ్ తేజ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సినిమా ఈవెంట్లో రోషన్ మేక ఎమోషనల్ స్పీచ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసత్వం అనేది మొదటి సినిమా ఓపెనింగ్ వరకు మాత్రమే పనికొస్తుంది. అయితే ఆ సినిమాతోని టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అయితే ఈ రోజుల్లో చాలామంది తమకంటూ ఒక సొంత గుర్తింపు సాధించుకొని ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటున్నారు.
చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగచైతన్య వంటి ఎంతోమంది హీరోలు తమకంటూ ఇప్పుడు ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంటున్నారు. ఇంకొంతమంది హీరోలు తమకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం రోషన్ మేక ఛాంపియన్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంటాడేమో చూడాలి.
‘నాన్న నువ్వే నా ఐడెంటిటీ’ అన్న రోషన్
రోషన్ మేక ఛాంపియన్ సినిమా ఈవెంట్లో వాళ్ళ ఫాదర్ శ్రీకాంత్ గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా ఈవెంట్ ఈరోజు జరుగుతుంది అన్నప్పుడు నాన్న నువ్వు రావాలి అని అంటే. నేను ఈవెంట్ కి వస్తానో రానో తెలీదు నీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉండాలిరా అని చెప్పారు. ఒకవేళ నేను వచ్చినట్లయితే ఆ స్పీచ్ అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటూ మాట్లాడారు. నేను ఫోకస్ అవుతాను అన్నారు.
కానీ ఇప్పుడు చెప్తున్నాను నాన్న నువ్వే నా ఐడెంటిటీ అంటూ తేల్చి చెప్పాడు రోషన్ మేక. అలానే నీ వలన నాకు చాలా మంది వ్యక్తులు పరిచయమయ్యారు వాళ్ళందరిలో కూడా మోస్ట్ లవబుల్ బ్రదర్ రామ్ చరణ్ తేజ్ అంటూ మాట్లాడారు రోషన్.
ఛాంపియన్ ఈవెంట్‌కు రామ్ చరణ్
ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ ముందు ముందు చాలా జరగబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అలానే ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ ఈవెంట్ వైజాగ్ లో జరగబోతున్నట్లు కూడా స్పీచ్ లో క్లారిటీ ఇచ్చాడు.
రోషన్ మేక ఎమోషనల్ స్పీచ్ సినిమాపై అంచనాలను పెంచింది. శ్రీకాంత్ పై ఆయన ప్రేమ, రామ్ చరణ్ ఉనికి ఈ ఈవెంట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘ఛాంపియన్’ సినిమా విజయం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


