
📌 Key Points
- ప్రభాస్ ‘ది రాజా సాబ్’ జనవరి 9న విడుదల; హారర్ కామెడీ, ఫాంటసీ టచ్‌తో అంచనాలు.
- చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ జనవరి 12న, వెంకటేష్ క్యామియోతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షించింది.
- రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13న, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న విడుదల.
- జనవరి 7, 2026న ప్రభాస్, రవితేజ, నవీన్ పోలిశెట్టి సినిమాల ట్రైలర్లు విడుదల.
సంక్రాంతి 2026 సినీ ప్రియులకు పండగే! ప్రభాస్, చిరంజీవి, రవితేజ సహా స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. జనవరి 7న పలు సినిమాల ట్రైలర్లు విడుదలవుతుండగా, ఏ సినిమా ఎప్పుడు వస్తుందో వివరాలు తెలుసుకోండి.
సంక్రాంతి 2026 బాక్సాఫీస్ వార్: ఏ హీరో ఎప్పుడు?
Sankranti 2026 Telugu Movies: తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా సినీ ప్రేమికులకు సంక్రాంతి అంటే ఒక పెద్ద సినిమా పండగ. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో థియేటర్ల ముందు ఫ్యాన్స్ సందడి, పెద్ద హీరోల సినిమాలు, భారీ ఓపెనింగ్స్ కామన్. ఈసారి సంక్రాంతి 2026 కూడా అదే రేంజ్‌లో ఉండబోతోంది. ఈసారి ఏకంగా ప్రభాస్, చిరంజీవి, రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లాంటి స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నాయి.
ముందుగా అందరి చూపు ఉంది ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న ‘ది రాజా సాబ్’ మీద. హారర్ కామెడీ, ఫాంటసీ టచ్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా జనవరి 9, 2026న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ కొత్త లుక్, మారుతి మార్క్ కామెడీ కలిసి సినిమా మీద భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అదే రోజున తలపతి విజయ్ నటించిన తమిళ సినిమా ‘జన నాయకుడు’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ అవుతోంది. విజయ్‌కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్‌బేస్ ఉండటంతో ఈ సినిమా కూడా థియేటర్ల దగ్గర బజ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.
ప్రభాస్, చిరంజీవి సినిమాలపై భారీ అంచనాలు
సంక్రాంతి రేస్‌లో మరో భారీ సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్‌లో పండగ వాతావరణం. అందులోనూ వెంకటేష్ క్యామియో కూడా ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా జనవరి 12, 2026న రిలీజ్ కానుంది. చిరంజీవిని మళ్లీ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌లో చూడబోతున్నామన్న ఆనందంలో ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
రవితేజ అభిమానులు ప్రత్యేకంగా ఎదురుచూస్తున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమాతో మాస్ మహారాజా గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జనవరి 13, 2026న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ జనవరి 7న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్టైనర్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా జనవరి 7న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది.
జనవరి 7: ఒక్క రోజులో ట్రైలర్ల సునామీ
చివరగా శర్వానంద్ హీరోగా నటించిన ‘నారి నారి నడుమ మురారి’ జనవరి 15, 2026న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు కూడా మంచి బజ్ ఉంది. అయితే మిగతా సినిమాల్లా జనవరి 7న పెద్ద ఈవెంట్స్ మాత్రం ప్లాన్ చేయలేదని సమాచారం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జనవరి 7, 2026. ఆ రోజు ట్రైలర్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, సెలబ్రిటీల స్పీచెస్‌తో సినిమా ప్రేమికులకు పండగ రోజు లాంటి వాతావరణం ఉండబోతోంది. చిరంజీవి వెంకటేష్ కలిసి పాల్గొనే ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగనుండటం ఇంకా పెద్ద హైలైట్. మొత్తానికి సంక్రాంతి 2026 బాక్సాఫీస్ హడావిడి మొత్తం జనవరి 7 న కనిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
మొత్తంగా, సంక్రాంతి 2026 సినీ ప్రియులకు ఓ పెద్ద పండగే. స్టార్ హీరోల సినిమాలు, భారీ పోటీతో జనవరి 7న ట్రైలర్ల సందడి మొదలైంది. ఈ సంక్రాంతి ఆడియన్స్‌కు వినోదం పంచడం ఖాయం.


