
📌 Key Points
- ప్రభాస్ ‘రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో జరిగింది.
- కమెడియన్ సప్తగిరి ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- ‘రాజా సాబ్’ సినిమా రూ. 2000 కోట్లు వసూలు చేస్తుందని సప్తగిరి ధీమా వ్యక్తం చేశారు.
- రాకపోతే ఆ డబ్బులు తానే ఇస్తానంటూ ప్రభాస్ సినిమాపై సప్తగిరి సవాల్ విసిరారు.
ప్రభాస్ ‘రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సప్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాజా సాబ్’ 2000 కోట్లు వసూలు చేస్తుందని, లేకపోతే తానే డబ్బులు ఇస్తానని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
Raja Saab Pre Release Event : టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజా సాబ్.. టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కామెడీ, హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ని రిలీజ్ చేస్తున్న చిత్ర యూనిట్ ఇవాళ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.. ఈ ఈవెంట్ కి ప్రభాస్ తప్ప చిత్ర యూనిట్ మొత్తం హాజరయ్యారు.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, మారుతి, అలాగే నిర్మాత, కమెడియన్ సప్తగిరి తో పాటు మహేష్, జహీర్ఖాన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.. కొద్ది నిమిషాల క్రితమే ఈ ఈవెంట్ గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది.. ఈ ఈవెంట్ లో సప్తగిరి స్పీచ్ ప్రస్తుతం హైలెట్ గా నిలిచింది. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం..
సప్తగిరి సంచలన వ్యాఖ్యలు: 2000 కోట్లు పక్కా?
పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో ఈ మూవీ తెరకెక్కింది. జనవరి 9 నా ఏ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళు ఎందుకు చిత్ర యూనిట్ తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.. ఈవెంట్ కొద్ది నిమిషాల క్రితమే మొదలైంది. ఈ ఈవెంట్ లో కమెడియన్ సప్తగిరి మాట్లాడారు.. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలో కమెడియన్ గా మంచి క్యారెక్టర్లలో ప్రభాస్ గారి పక్కన నటించాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు సినిమాలలో సలార్ రెండు వేల కోట్లు రాబడుతుంది అని చెప్పాను.. అలాగే ఈ సినిమా కూడా 2వేల కోట్లు పక్కాగా రాబడుతుంది రాసి పెట్టుకోండి అని సప్తగిరి అన్నారు.. 2వేల కోట్లు రాకపోతే ఆ డబ్బులు నేనిస్తాను పక్క అని సప్తగిరి అంటారు. సినిమా మొత్తం జనాలను ఆకట్టుకుంటుంది.. గులాబ్ జాములు గలగల లాడిపోతాయి. కోడిగుడ్లు డబల్ ఆమ్లెట్లు అవుతాయి. ఇలాంటి ప్రభాస్ ని మరొక పదేళ్లు మీరు చూడలేరు ఇంత రొమాంటిక్ సీన్లలో ప్రభాస్ ఇంకెప్పుడు కనిపించడు అని సప్తగిరి అన్నారు. ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి నెక్స్ట్ వచ్చే సినిమాలన్నీ యాక్షన్ సినిమాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి అని సప్తగిరి అంటారు.. ప్రస్తుతం ఆయన స్పీచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటి వరకే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ గానే ఉండడంతో సినిమా ఖచ్చితంగా 2వేల కోట్లు పక్కాగా రాబడుతుందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. మరి ఎన్ని కోట్లు చివరగా వసూలు చేస్తుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు మాత్రమే వెయిట్ చేయాలి..
ప్రభాస్ ‘రాజా సాబ్’ విశేషాలు
గత ఏడాది కల్కి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో మారుతి దర్శకత్వంలో రాబోతున్న రాజా సాబ్ వచ్చే ఏడాది జనవరి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.. హారర్-కామెడీ జానర్ కావడంతో ప్రతిదీ కొత్తగా ఉంటుందని మారుతి అన్నాడు. ప్రభాస్ మేకప్, హెయిర్ స్టైల్, ఆయన మాట్లాడే తీరు.. అంతా కొత్తగా ఉంటుందని ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ చూస్తే తెలుస్తుంది.. ఇటీవల రిలీజైన సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది.. ప్రభాస్ లైఫ్ లో ఇలాంటి స్టోరీతో రావడం ఇదే మొదటిసారి.. దీంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి థియేటర్ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..
సప్తగిరి వ్యాఖ్యలతో ‘రాజా సాబ్’పై అంచనాలు మరింత పెరిగాయి. జనవరి 9న సినిమా విడుదల కానుంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందో చూడాలి.


