
📌 Key Points
- దెక్కన్ కిచెన్ కేసులో దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.
- ఫిబ్రవరి 25కు తదుపరి విచారణను వాయిదా వేసిన కోర్టు.
- వ్యక్తిగత హాజరు నుండి దగ్గుబాటి ఫ్యామిలీకి మినహాయింపు లభించింది.
- తప్పుడు కథనాలతో మీడియా ప్రచారం చేయడంపై దగ్గుబాటి ఫ్యామిలీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దగ్గుబాటి ఫ్యామిలీని డెక్కన్ కిచెన్ కేసు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు లభించింది.
దెక్కన్ కిచెన్ కేసు: అసలేం జరిగింది?
Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీని డెక్కన్ కిచెన్ కేసు ఎంతగా వెంటాడుతుందో తెలియంది కాదు. అక్కడ జరుగుతుంది ఒకటైతే, సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది మరో అంశం అన్నట్లుగా మారిపోయింది. దీంతో విసిగిపోయిన దగ్గుబాటి ఫ్యామిలీ సీరియస్‌గా రియాక్ట్ అవుతూ ఇటీవల ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. కోర్టు విచారణను కూడా బ్రేకింగ్ న్యూస్‌లో వేస్తున్నారంటూ ఈ ప్రకటనలో దగ్గుబాటి ఫ్యామిలీ బాధను వ్యక్తం చేసింది. సమస్య ఏంటి? అసలు ఆ సమస్య చట్ట పరిధిలో ఉన్నప్పుడు ఎలా పడితే అలా వార్తలు ప్రచారం చేయవచ్చా? అనేది లేకుండా.. కాస్త పేరున్న ఫ్యామిలీ కావడంతో.. ఏ చిన్న విషయం వచ్చినా, దానికి ఇంకో రెండు జోడించి.. భారీ స్థాయిలో దానిని ప్రచారం చేయడంపై దగ్గుబాటి ఫ్యామిలీ (Daggubati Family) సీరియస్ అవుతూ.. ఇకపై ఇలానే చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరింది.
నాంపల్లి కోర్టులో విచారణ వాయిదా
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు (Nampally Court)లో విచారణ జరుగుతుంది. ఈ కేసులో తాజా అప్డేట్ ఏంటంటే.. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసు నిమిత్తం వ్యక్తిగత హాజరుకు మినహాయింపును కూడా దగ్గుబాటి ఫ్యామిలీకి కోర్టు ఇచ్చింది. ఇక రీసెంట్‌గా దగ్గుబాటి ఫ్యామిలీ విడుదల చేసిన ప్రకటన విషయానికి వస్తే.. ‘‘డెక్కన్ కిచెన్ కేసులో ప్రతి కోర్టు విచారణను బ్రేకింగ్ న్యూస్ పేరిట ఆధార రహిత కథనాలతో మీడియా తప్పుగా ప్రచారం చేయడం బాధాకరం. నాంపల్లి కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న విషయం నిజమే. అయితే దగ్గుబాటి కుటుంబానికి వ్యతిరేకంగా కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో కూడా కోర్టు ఎలాంటి హెచ్చరిక చేయలేదు. మా తరపున అడ్వకేట్ హాజరవుతున్నందున వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు ఇప్పటికే మాకు మినహాయింపును ఇచ్చింది.
మీడియా కథనాలపై దగ్గుబాటి ఫ్యామిలీ సీరియస్
నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని మా అపోజిషన్ పార్టీ వాళ్ళు కోర్టును ప్రాదేయపడినా అవసరం లేదని కోర్టు తిరస్కరించింది. దీనికి బదులు ప్రతి విచారణలో పూర్తి నిరాధార, అవాస్తవ వార్తలను మీడియా ప్రచారం చేస్తుంది. ఇలాంటి వార్తలు ప్రచారం చేసే ముందు అధికారిక కోర్టు రికార్డులతో రూడీ చేసుకోవాలని మీడియా సంస్థలను కోరుతున్నాము. ఇప్పటికే ప్రసారం చేసిన, ప్రచురించిన తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలను వెంటనే తొలగించాల్సిందిగా అన్ని న్యూస్ ఛానళ్లను, సోషల్ మీడియాను, న్యూస్ పోర్టల్స్‌ను కోరుతున్నాము. అలా చేయలేదంటే మేము తగిన న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిసున్నాము’’ అని దగ్గబాటి ఫ్యామిలీ ఈ ప్రకటనలో పేర్కొంది.
దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన ఈ కేసు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో నడుస్తోంది. తదుపరి విచారణ ఫిబ్రవరి 25న జరగనుంది. మీడియా కథనాలపై కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది.

