
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ‘దక్ష – ది డెడ్లీ కాన్‌స్పిరసీ’ సినిమా టీజర్ విడుదలైంది. ఏలియన్ దాడి, వింత వ్యాధి నేపథ్యం ఈ సినిమాను ఆసక్తికరంగా మార్చాయి. మోహన్ బాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.
Key Points
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో 'దక్ష – ది డెడ్లీ కాన్‌స్పిరసీ'
ఏలియన్ దాడి, వింత వ్యాధి నేపథ్యంతో ఉత్కంఠభరిత కథానకం
మోహన్ బాబు, మంచు లక్ష్మి తొలిసారి కలిసి నటించిన సినిమా
సెప్టెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల
‘దక్ష – ది డెడ్లీ కాన్‌స్పిరసీ’ టీజర్ విడుదల
మంచు లక్ష్మి ప్రసన్న ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ దక్ష-ది డెడ్లీ కాన్‌స్పిరసీ (Daksha – The Deadly Conspiracy). శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు.
‘దక్ష – ది డెడ్లీ కాన్‌స్పిరసీ’ సినిమాలో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఇందులో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ బోర్డ్ నుంచి యూఏ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది.
అంతేకాదు, మంచి మెసేజ్‌తో వస్తున్న ఇలాంటి సినిమాలు ఇప్పుడవసరం అంటూ సెన్సార్ సభ్యులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా మంచు లక్ష్మీ ప్రసన్న చేసిన టైటిల్ పాత్రను సెన్సార్ బోర్డు సభ్యులు కొనియాడారు.
ఏలియన్ దాడి, వింత వ్యాధి నేపథ్యం
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యేందుకు దక్ష ది డెడ్లీ కాన్‌స్పిరసీ సిద్ధమైంది. ఈ సందర్భంగా తాజాగా ది డెడ్లీ కాన్‌స్పిరసీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆగస్ట్ 27 బుధవారం నాడు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ టీజర్‌లో ఇప్పటి వరకు మంచు లక్ష్మి కనిపించని వీరోచిత రోల్‌లో, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. వింత ఆకారంలో ఓ ఏలియన్ వంటి ఓ జీవి మనుషుల్ని దారుణంగా చంపే సన్నివేశంతో టీజర్ మొదలైంది. అలాగే ఓ వింత వ్యాధి నేపథ్యం, దాని వెనుక కారణం ఏంటనే ఇంట్రస్ట్‌ని ఈ టీజర్ కలగజేస్తుంది.
ది డెడ్లీ కాన్‌స్పిరసీ సినిమాలో సముద్రఖని , విశ్వంత్, సిద్ధిక్, జెమినీ సురేష్ వంటి వారందరూ ఇందులో కీలక పాత్రలు పోషించినట్లుగా టీజర్ తెలియజేస్తుంది. ఇక చివరిలో డాక్టర్ మోహన్ బాబు కనిపించిన ఒకే ఒక్క షాట్.. టీజర్ స్థాయిని పెంచేసింది. ఆయన పాత్ర ఈ సినిమాకు ప్రాణం అనే హింట్ ఇచ్చేసింది.
మోహన్ బాబు, మంచు లక్ష్మి కలిసి నటించడం ప్రత్యేకం
ఓవరాల్‌గా టీజర్‌తో దక్ష ది డెడ్లీ కాన్‌స్పిరసీ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడేలా చేశారు మేకర్స్. ఈ సినిమాకు అచు రాజమణి సంగీతం అందించారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇక నిర్మాతలుగా మోహన్ బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న ఉన్నారు.
కాగా, ది డెడ్లీ కాన్‌స్పిరసీ మూవీలో మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ, సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా, రంగస్థలం మహేష్, జెమినీ సురేష్ తదితరులు నటించారు.
మొత్తంమీద, ‘దక్ష – ది డెడ్లీ కాన్‌స్పిరసీ’ టీజర్ ఆకర్షణీయంగా ఉండి సినిమాపై ఆసక్తిని పెంచింది. మంచు లక్ష్మి, మోహన్ బాబుల నటనకు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.


