|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dalljiet Kaur: ‘అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. విడాకులపై బుల్లితెర నటి’

Published: 05-09-2025, 9:55 AM
Dalljiet Kaur: 'అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. విడాకులపై బుల్లితెర నటి'

బుల్లితెర నటి దల్జీత్ కౌర్ తన రెండో వివాహం విడాకులతో ముగియడంపై తీవ్రంగా స్పందించింది. మోసం, మానసిక హింస ఆరోపణలు చేస్తూ, క్షమాపణ కోసం ఆమె పోరాటం ప్రారంభించింది.

Key Points

1

దల్జీత్ కౌర్ రెండో వివాహం విడాకులతో ముగిసింది.

2

మోసం, మానసిక వేధింపుల ఆరోపణలు నిఖిల్ పటేల్ పై ఉన్నాయి.

4

నిఖిల్ పటేల్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె కెన్యా నుండి భారతదేశానికి తిరిగి వచ్చింది.

నిఖిల్ పటేల్ తో విడాకులు

బాలీవుడ్ బుల్లితెర నటి దల్జీత్‌ కౌర్‌ చెప్పాల్సిన పనిలేదు . సినీ కెరీర్ కంటే వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది . మొదటి భర్తతో విడిపోయినా ఆమె .. రెండో పెళ్లి కూడా కలిసిరాలేదు . వ్యాపారవేత్త నిఖిల్ పటేల్ ‌ ను రెండో పెళ్లి చేసుకోగా .. ఆతర్వాత విభేదాలు రావడంతో విడిపోయారు . 2023 లో వీరిద్దరు పెళ్లి పీటలెక్కగా కొన్ని నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించారు .

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దల్జీత్ కౌర్ తన విడాకులపై మరోసారి మాట్లాడింది . తన మాజీ భర్త నిఖిల్ పటేల్ ‌ పై విమర్శలు చేసింది . విడిపోయాక తన లైఫ్ ‌ లో ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితులను పంచుకుంది . ఈ విషయంలో నిఖిల్ పటేల్ తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది . ఈ విషయంలో మాత్రం తాను మౌనంగా ఉండనని స్పష్టం చేసింది . అతను క్షమాపణ చెప్పేవరకు పోరాటం చేస్తానని దల్జీత్ కౌర్ ‌ తెలిపింది .

మోసం మరియు మానసిక వేధింపులు

దల్జీత్ కౌర్ మాట్లాడుతూ .. ‘ పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది . కానీ నా లైఫ్ ‌ లో మళ్లీ ఇలా జరగడం చాలా కోపం తెప్పించింది . ఈ విషయంలో తాను మౌనంగా ఉండనన్న విషయం నిఖిల్ తెలుసుకోవాలి. అతను నాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే . ఈ విషయంలో నా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతా . నాకు అతని వద్ద నుంచి క్షమాపణ రావాలి. దానికోసం ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్తా ‘ అని అన్నారు.

కాగా .. నిఖిల్ ‌ తో పెళ్లి తర్వాత కెన్యా వెళ్లిన ఆమె కేవలం పది నెలలకే ఇండియాకు తిరిగొచ్చింది . తన కుమారుడితో సహా వచ్చిన తర్వాత అతనిపై తీవ్ర విమర్శలు చేసింది . నిఖిల్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసింది. అతనికి మరొకరితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని .. తనను మానసిక వేధింపులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది . ఆ తర్వాత నిఖిల్ తన స్నేహితురాలు సఫీనా నాజర్‌తో కూడా ముంబయిలో కనిపించారు .

క్షమాపణ కోసం పోరాటం

కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్‌ ప్యార్‌ కో క్యా నామ్‌ ధూ) ఫేమ్‌ దల్జీత్‌.. 2009లో నటుడు షాలిన్‌ బానోత్‌ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా జైడన్‌ అనే కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్‌ అనే వ్యక్తిని కలిసింది. ఇతడు కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కావడంతో రెండో పెళ్లి చేసుకున్నారు .

దల్జీత్ కౌర్ తన భర్త నుండి క్షమాపణ కోసం పోరాటం చేస్తూ, తన అనుభవాలను బయటపెట్టింది. ఈ వివాదం తెలుగు సినీ ప్రేక్షకులలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.