|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dark Chocolate Movie: డార్క్ చాక్లెట్ మూవీ.. పెద్దలకు మాత్రమే

Published: 11-10-2025, 7:22 AM
Dark Chocolate Movie: డార్క్ చాక్లెట్ మూవీ.. పెద్దలకు మాత్రమే

రానా నిర్మాతగా రూపొందుతున్న ‘డార్క్ చాక్లెట్’ మూవీ టీజర్ విడుదలైంది. పెద్దల కోసం మాత్రమే తీసిన ఈ చిత్రంపై టీజర్ ద్వారానే ఆసక్తి నెలకొంది. బూతు మాటలు, ప్రత్యేకమైన ప్రమోషన్ దీని విశేషాలు.

Key Points

1

'డార్క్ చాక్లెట్' మూవీని ప్రముఖ నటుడు రానా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

2

టీజర్‌లో బూతు మాటలు వినిపించాయి, పెద్దల కోసం మాత్రమే ఈ సినిమా తీసినట్లు తెలుస్తుంది.

4

సినిమా విడుదల తేదీలను అక్టోబరు 31, నవంబరు 14, డిసెంబరు 5 అని ప్రకటించారు.

‘డార్క్ చాక్లెట్’ టీజర్: పెద్దల కోసమేనా?

రీసెంట్ టైంలో సినిమాల్లో వైల్డ్‌నెస్ పేరిట బూతుల్ని, బూతు సన్నివేశాల్ని అక్కడక్కడ ఉపయోగిస్తున్నారు. కొన్నింటికి సెన్సార్ కత‍్తెర వేస్తున్నప్పటికీ మరికొన్నిసార్లు మాత్రం మూవీకి ‘ఏ’ సర్టిఫికెట్ లాంటివి తెచ్చుకుని రిలీజ్ చేస్తున్నారు. వీటిని యూత్ చూస్తారు. ఫ్యామిలీ అడియెన్స్ కాస్త దూరంగానే ఉంటారు. సరే ఇదంతా పక్కనబెడితే రానా నిర్మాతగా ‘డార్క్ చాక్లెట్’ అనే మూవీ త్వరలో రాబోతుంది. దీని టీజర్ ఇప్పుడు రిలీజ్ చేశారు.

రానా నిర్మాణంలో నటీనటులు, టెక్నీషియన్లు

టీజర్ చూస్తుంటే.. యజ్ఞ అనే హీరో, ఓ ముగ్గురు వ్యక్తుల(ఓ మహిళ, ఇద్దరు పురుషులు) మధ్య జరిగే కథే ఈ సినిమా స్టోరీలా అనిపిస్తుంది. అయితే టీజర్ బూతు సన్నివేశాలేం లేవు గానీ బూతు మాటలు మాత్రం కాస్త గట్టిగానే వినిపించాయి. అయితే వీటిని టీజర్ కోసమే పెట్టారా? నిజంగా మూవీలోనూ ఉంచుతారా అనేది చూడాలి? అయితే హీరో రానా నిర్మాతగా ఈ తరహా మూవీ వస్తుందని అస్సలు ఊహించలేదు.

సినిమా విడుదల తేదీలపై ఆసక్తి

’35’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వదేవ్ ఇందులో హీరో కాగా బిందుమాధవి హీరోయిన్. మరో ఇద్దరు కూడా తెలుగు నటులే. ‘కిడ్స్ పక్కకెళ్లి ఆడుకోండి’ ,’పాన్ మసాలా మూవీ’, ‘జానర్ అడగొద్దు’ లాంటి క్యాప్షన్స్ చూస్తుంటే కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అలానే రిలీజ్ ఎప్పుడనేది కూడా అక్టోబరు 31, నవంబరు 14, డిసెంబరు 5 అని మూడు తేదీలు ప్రకటించి, మనల్నే ఎంచుకోమన్నట్లు చూపించారు. శశాంక్ శ్రీ వాస్తవ్య దర్శకుడు కాగా వివేక్ సాగర్ సంగీతమందించాడు. చూస్తుంటే ఇది పెద్దల కోసం మాత్రమే తీసిన సినిమాలా అనిపిస్తుంది.

మొత్తానికి ‘డార్క్ చాక్లెట్’ మూవీ టీజర్ పెద్దల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. రానా నిర్మాణం, వయోజన కంటెంట్, వివేక్ సాగర్ సంగీతం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.