|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు సినిమాల అప్‌డేట్! (వీడియో)

Published: 16-05-2025, 11:16 AM
డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు సినిమాల అప్‌డేట్! (వీడియో)

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించే ‘రాజాసాబ్’ మరియు ‘ఫౌజీ’ చిత్రాలకు సంబంధించిన తాజా సమాచారం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. రెండు సినిమాల నుంచి ఒకేసారి వచ్చిన అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం.

Key Points

1

ప్రభాస్ 'రాజాసాబ్' టీజర్ త్వరలోనే విడుదల కానుంది.

2

'రాజాసాబ్' డబ్బింగ్ పూర్తయింది, ఈ నెలలో టీజర్ విడుదల అవుతుంది.

4

రెండు సినిమాల అప్డేట్స్ ప్రభాస్ అభిమానులకు పండగ వాతావరణాన్ని సృష్టించాయి.

‘రాజాసాబ్’ టీజర్ విడుదలకు సిద్ధం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. కానీ.. ఏ ఒక్క సినిమా నుంచి కూడా సరైనా అప్‌డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే డార్లింగ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకే సారి రెండు సినిమాల నుంచి అప్‌డేట్ వచ్చింది. ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ‘రాజాసాబ్’ (Rajasab)ఒకటి. మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు ఆకట్టుకోగా.. ఇప్పుడు టీజర్ వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ రెండు రోజుల్లో ‘రాజాసాబ్’ డబ్బింగ్‌పై ఒక క్లారిటీ రాగా.. అంతా బాగుంటే ఈ నెలకారులో అదిరిపోయే టీజర్ రాబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ఇక దీంతో పాటు.. ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘ఫౌజీ’(Fawzi)నుంచి కూడా ఓ అప్‌డేట్ వచ్చింది. హను రాఘవపూడి (Hanu Raghavapudi)దర్శకత్వంలో రాబోతున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ వచ్చే వారం నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఈ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘ఫౌజీ’ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం

ప్రభాస్ అభిమానుల ఆనందం

ప్రభాస్ ‘రాజాసాబ్’ మరియు ‘ఫౌజీ’ సినిమాల అప్డేట్స్ అభిమానులను ఉత్సాహపరిచాయి. త్వరలోనే మరిన్ని విశేషాల కోసం ఎదురు చూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.