|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Darshan Thoogudeepa: దర్శన్ భార్యకు వేధింపులు.. మహిళా కమిషన్‌ సీరియస్!

Published: 29-08-2025, 1:22 AM
Darshan Thoogudeepa: దర్శన్ భార్యకు వేధింపులు.. మహిళా కమిషన్‌ సీరియస్!

కన్నడ సూపర్ స్టార్ దర్శన్ భార్య విజయలక్ష్మి మరియు కుమారుడు వినీశ్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ వేధింపులపై మహిళా కమిషన్ గట్టి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

Key Points

1

దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీశ్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు.

2

మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో కమిషన్ పోలీసులకు ఆదేశాలు.

4

15 రోజుల్లో నివేదిక సమర్పించాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశం.

సోషల్ మీడియాలో వేధింపులు

కన్నడ స్టార్ ‌ దర్శన్ ‌ ఓ అభిమాని హత్యకేసులో జైలుకెళ్లిన సంగతి తెలిసిందే . ఇటీవలే సుప్రీం కోర్టు ఆయన బెయిల్ రద్దు చేయడంతో మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు . ఆయనతో పాటు ప్రియురాలి పవిత్ర గౌడను కూడా అదుపులోకి తీసుకున్నారు . రేణుకస్వామి అనే అభిమాని పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడని అతన్ని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది . ఆ తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ ‌ చేసి జైలుకు పంపారు .

మహిళా కమిషన్‌ స్పందన

అయితే ఈ ఘటన తర్వాత దర్శన్ కుటుంబాన్ని టార్గెట్ ‌ చేస్తూ కొందరు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు . దర్శన్ భార్య విజయలక్ష్మీతో పాటు ఆయన కుమారుడు వినీశ్ ‌ పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు . తాజాగా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నెలమంగళకు చెందిన భాస్కర్ ప్రసాద్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు . విజయలక్ష్మి దర్శన్, ఆమె కొడుకును సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదాలతో దుర్భాషలాడుతూ మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు . మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

పోలీసులకు ఆదేశాలు

ఈ ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్ ‌ చర్యలకు దిగింది . అసభ్యకరమైన పోస్టులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నాగలక్ష్మి పోలీసులను ఆదేశించింది . దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరింది . ఇటీవల నటి రమ్యపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే .

దర్శన్ కుటుంబంపై సోషల్ మీడియా వేధింపులపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. పోలీసుల దర్యాప్తు తర్వాతే నిజస్థితి వెల్లడి అవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.