
దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించి, ఆమె అనుగ్రహం పొందేందుకు ప్రతి రాశి వారు జపించాల్సిన ప్రత్యేక మంత్రాలను ఈ కథనంలో తెలుసుకుందాం. శుభ ఫలితాలను పొందండి.
Key Points
నవరాత్రుల్లో అమ్మవారిని పూజించి, ఆమె అనుగ్రహం పొందండి.
మీ రాశికి తగిన మంత్రాన్ని జపించి, ఆశీస్సులు పొందండి.
దీపారాధన చేసి, ఇంట్లో సానుకూల శక్తిని పెంపొందించుకోండి.
నవరాత్రుల సమయంలో మంచి కార్యాలను చేపట్టండి.
ప్రతి రాశికి ప్రత్యేక మంత్రం
నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి మొదలయ్యాయి. తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రూపంలో ఉన్న అమ్మవారిని అందంగా అలంకరించి, నైవేద్యాలని సమర్పించి, భక్తశ్రద్ధలతో ఆరాధిస్తారు.
ఉదయం, సాయంత్రం రెండు పూటలా కూడా దీపారాధన చేసి అమ్మవారిని పూజిస్తారు. అయితే దసరా నవరాత్రుల్లో అమ్మవారి శ్లోకాలు, మంత్రాలు పఠిస్తే అమ్మవారి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇంట్లో సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. అయితే, రాశుల ఆధారంగా ఏ రాశి వారు ఏ మంత్రాన్ని జపిస్తే మంచిదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి వారు ఈ తొమ్మిది రోజులు కూడా ‘ఓం దమ్ దుర్గాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తే మంచిది. ఇలా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.
వృషభ రాశి వారు నవరాత్రుల్లో ‘ఓం లలిత దేవియే నమః’ అనే మంత్రాన్ని పఠిస్తే మంచిది. ఈ మంత్రాన్ని పాటించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి, అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి.
మిధున రాశి వారు ‘ఓం శ్రీ అంబికాయే నమః’ అనే మంత్రాన్ని పఠిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, శుభ ఫలితాలను పొందవచ్చు.
అమ్మవారి అనుగ్రహం పొందే విధానం
కర్కాటక రాశి వారు ‘ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్ఛయే’ అనే మంత్రాన్ని పఠించడం వలన మంచి జరుగుతుంది, శుభ ఫలితాలను ఎదుర్కోవచ్చు.
సింహ రాశి వారు ‘సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే భయేభ్యే స్త్రాహి నౌ దేవి దుర్గే దేవి నమోస్తుతే’ అనే మంత్రాన్ని జపించాలి.
కన్య రాశి వారు నవరాత్రుల్లో అమ్మవారి ప్రత్యేక అనుగ్రహం కలగడానికి ‘సర్వ మంగళ మాంగల్యయే శివే సర్వార్థ సాధికే శరణ్యయే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే’ అనే మంత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
తులా రాశి వారు ‘సర్వ బాధా వినిర్ముక్తో ధన్ ధన్యయే సుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన్ భవిష్యతి న సంశయః’ అనే మంత్రాన్ని పఠిస్తే మంచిది.
వృశ్చిక రాశి వారు ‘సర్వ బాధా వినిర్ముక్తో ధన్ ధన్యయే సుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన్ భవిష్యతి న సంశయః’ మంత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి, అమ్మవారి ప్రత్యేక అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.
నవరాత్రి పూజా విధానం
ధనుస్సు రాశి వారు ‘ఓం గిరిజాయై విద్మహే శివ ప్రియాయే ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్’ మంత్రాన్ని పఠిస్తే సకల శుభాలు కలుగుతాయి, అమ్మవారి ప్రత్యేక అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
మకర రాశి వారు ‘శరణాగత్ దీనార్త్ పరిత్రాన్ పరాయణే సర్వస్యార్తి హరే ద్దేవీ నారాయణి నమోస్తుతే’ మంత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
కుంభ రాశి వారు ‘యా దేవి సర్వ భూతేషు శక్తి రూపేన్ సంస్థిత నమస్తస్యయే నమస్తస్యయే నమస్తస్యయే నమో నమః’ అనే మంత్రాన్ని పఠిస్తే దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది, సకల సంతోషాలను పొందవచ్చు.
మీన రాశి వారు ‘ఓం హ్రీం దుం దుర్గయే నమః’ అనే మంత్రాన్ని పఠిస్తే మంచి జరుగుతుంది, అమ్మవారి ప్రత్యేక అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
నవరాత్రుల్లో ఈ మంత్రాలను నియమబద్ధంగా జపించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. శుభ ఫలితాలు, సంతోషం లభిస్తాయి. శుభకార్యాలను చేపట్టడానికి ఇది శుభ సమయం.


