
📌 Key Points
- మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ సినిమాతో ప్రస్తుతం బిజీగా గడుపుతున్నాడు.
- హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది.
- రామ్ చరణ్, శింబు కామియోలపై తీవ్ర ప్రచారం జరిగింది.
- అయితే మనోజ్ దీనిపై స్పందిస్తూ ఇంకా ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశాడు.
మంచు మనోజ్ తన తాజా ప్రాజెక్ట్ ‘డేవిడ్ రెడ్డి’ షూటింగ్‌లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శింబు కామియో రోల్స్‌లో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఊహాగానాలపై మంచు మనోజ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్, డేవిడ్ రెడ్డి విశేషాలు
కొద్ది కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మంచు మనోజ్ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇటీవల తన కుటుంబ గొడవల కారణంగా వార్తల్లో నిలిచిన మంచు మనోజ్ సినిమాల పరంగా వరుస హిట్స్ సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల భైరవం, మిరాయ్ వంటి చిత్రాలతో ఘన విజయం సాధించిన ఆయన తీరిక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం మంచు మనోజ్(Manchu Manoj) తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy)మూవీ పనుల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. హనుమరెడ్డి యక్కంటి (Hanumareddy Yakkanti)దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది.
రామ్ చరణ్, శింబు కామియోలపై రూమర్స్
మనోజ్ ఇండస్ట్రీలో 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఇక అప్పటినుంచి సైలెంట్‌గా షూటింగ్ మొదలెట్టిన టీమ్.. బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈక్రమంలో.. ఇందులో ఇద్దరు స్టార్స్ కామియో రోల్‌లో కనిపించనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ సారి మంచు మనోజ్ గట్టిగా ప్లాన్ చేశాడని అందుకే తనతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శింబులకు భాగం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
వార్తలపై మనోజ్ స్పష్టత
ఈక్రమంలో.. తాజాగా, మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ మూవీ టీజర్‌ను విడుదల చేశాడు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ‘డేవిడ్ రెడ్డి’ గురించి వస్తున్న వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. రామ్ చరణ్, శింబు క్యామియోలుగా కనిపించనున్నారనే వార్తలు నిజమేనా? అని ప్రశ్నించగా.. ‘‘మేము ఇప్పటి వరకూ ఎవరినీ సంప్రదించలేదు. ఇప్పటికైతే గ్లింప్స్ మాత్రమే వచ్చింది. ఇంకా చాలా రోజులు ఉన్నాయి కాబట్టి నేను దాని గురించి మున్ముందు మాట్లాడతాను’’ అని మంచి మనోజ్ బదులిచ్చారు. దీంతో పుకార్లకు చెక్ పడింది.
‘డేవిడ్ రెడ్డి’ చిత్రంలో స్టార్స్ కామియో రోల్స్ గురించి వస్తున్న వార్తలపై మంచు మనోజ్ స్పష్టతనిచ్చారు. ప్రస్తుతానికి ఎవరినీ సంప్రదించలేదని, భవిష్యత్తులో ఈ విషయమై మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతానికి పుకార్లకు చెక్ పడినట్లయింది.


