|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

థియేటర్లలో సందడి చేసి.. ఓటీటీలోకి వచ్చిన మోగ్లీ.. ఎక్కడ చూడాలంటే!

Published: 01-01-2026, 5:30 AM
థియేటర్లలో సందడి చేసి.. ఓటీటీలోకి వచ్చిన మోగ్లీ.. ఎక్కడ చూడాలంటే!
  • ‘మోగ్లీ’లో రోషన్ కనకాల, సాక్షి జంటగా నటించారు.
  • ఈ లవ్ థ్రిల్లర్ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు.
  • ‘మోగ్లీ’ సినిమా డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది.
  • కొత్త ఏడాదిలో ఓటీటీలో విడుదలైన తొలి తెలుగు చిత్రంగా మోగ్లీ నిలిచింది.

యంగ్ హీరో రోషన్ కనకాల నటించిన తాజా లవ్ థ్రిల్లర్ ‘మోగ్లీ’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త ఏడాది కానుకగా అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మోగ్లీ: కథేంటి? నటీనటులు ఎవరు?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా, సాక్షి(Sakshi Madolkar) హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ లవ్ థ్రిల్లర్ చిత్రం ‘మోగ్లీ’(Mogli). సందీప్ రాజ్(Sandeep Raj) దర్శకత్వం వహించిన ఈ మూవీలో పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) యాంటీ హీరోగా నటించాడు. ఈ చిత్రంలో వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించగా.. కాల భైరవ సంగీతం అందించారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. అయితే రీసెంట్‌గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి వసూళ్లు సాధించింది.

ఓటీటీలో మోగ్లీ స్ట్రీమింగ్ ఎక్కడ?

అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) సొంతం చేసుకుంది. కొత్త ఏడాది కానుకగా జనవరి నెలలో ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో 2026లో ఓటిటీలో విడుదలైన తొలి తెలుగు సినిమాగా ‘మోగ్లీ’ నిలిచింది. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఈటీవీ విన్‌లో వీక్షించవచ్చు. కాగా కొత్త ఏడాది ప్రారంభంలోనే ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమా ఓటిటిలోకి రావడంతో మూవీ లవర్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది.

మొదటి తెలుగు సినిమాగా మోగ్లీ రికార్డు

A post shared by ETV Win (@etvwin)

మొత్తంగా, కొత్త ఏడాది ప్రారంభంలోనే ‘మోగ్లీ’ లాంటి ఆసక్తికరమైన లవ్ థ్రిల్లర్ ఓటీటీలోకి రావడంతో సినీ ప్రియులకు పండగే. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను మిస్ కాకుండా చూసేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.