
అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘దే దే ప్యార్ దే 2’ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. రొమాంటిక్ కామెడీతో నిండిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. గత చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది.
Key Points
'దే దే ప్యార్ దే 2' ట్రైలర్ విడుదలైంది; ఫుల్ రొమాంటిక్ కామెడీతో అలరిస్తోంది.
అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ జంటగా నటించగా, టబు ఈసారి లేదు.
అన్షుల్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది.
ఆర్ మాధవన్, మీజాన్ జాఫ్రీ, ఇషితా దత్తా కీలక పాత్రలు పోషించారు.
‘దే దే ప్యార్ దే 2’ ట్రైలర్ హైలైట్స్
అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, టబు లీడ్ రోల్స్‌లో నటించిన బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ 2019లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా దే దే ప్యార్ దే 2 తెరకెక్కించారు. ఈ చిత్రంలో మరోసారి రకుల్, అజయ్ కనిపించనుండగా.. టబు మాత్రం నటించడం లేదు. అయితే సీక్వెల్‌కు అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అజయ్ దేవగణ్, రకుల్ మధ్య కామెడీ సీన్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. మీ బాయ్‌ఫ్రెండ్ వయస్సు.. మీ నాన్న వయసంత ఉంటే.. అంటూ ట్రైలర్‌ను పోస్ట్ చేసింగి రకుల్ ప్రీత్ సింగ్. కాగా.. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, మీజాన్ జాఫ్రీ, ఇషితా దత్తా, గౌతమి కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం చిల్ర్డన్స్ డే సందర్భంగా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి లవ్ రంజన్ కథను అందించడంతో పాటు టి-సిరీస్ భూషణ్ కుమార్‌తో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించారు.
సీక్వెల్ స్టార్ కాస్ట్, డైరెక్టర్ వివరాలు
విడుదల తేదీ, ఇతర ముఖ్య పాత్రలు
‘దే దే ప్యార్ దే 2’ ట్రైలర్ ఇప్పటికే భారీ అంచనాలను పెంచింది. ప్రేమ, కామెడీల సమ్మేళనంతో ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి.


