|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డిసెంబర్‌ లో సినిమాల పండగ, 10 సినిమాల రిలీజ్, ఐదుగురు స్టార్ హీరోల మధ్య భారీ బాక్సాఫీస్ వార్

Published: 02-12-2025, 3:10 AM
డిసెంబర్‌ లో సినిమాల పండగ, 10 సినిమాల రిలీజ్, ఐదుగురు స్టార్ హీరోల మధ్య భారీ బాక్సాఫీస్ వార్
  • నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
  • డిసెంబర్ 5న ‘లాక్‌డౌన్’, కార్తి ‘వా వాతియార్’, మమ్ముట్టి ‘కలమకవల్’ చిత్రాలు విడుదల కానున్నాయి.
  • డిసెంబర్ 11న దర్శన్ ‘ది డెవిల్’, డిసెంబర్ 18న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, ‘రెట్టా తలా’ రిలీజ్.
  • డిసెంబర్ 18న దిలీప్ ‘భాభాబా’, డిసెంబర్ 25న నివిన్ పౌలీ ‘సర్వమయమ్’ వంటి చిత్రాలు రానున్నాయి.

డిసెంబర్ నెల సినీ ప్రియులకు పండుగ వాతావరణాన్ని తీసుకొస్తోంది. దాదాపు పదికి పైగా చిత్రాలు ఈ నెలలో విడుదల కానున్నాయి. బాలకృష్ణ అఖండ 2 వంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు పలు ఆసక్తికర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.

డిసెంబర్ 5న విడుదలయ్యే చిత్రాలు

నందమూరి బాలకృష్ణ అఖండ సీక్వెల్ అఖండ 2తో తిరిగి వస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో అభిమానులను అలరించబోతోంది.  ఈ సినిమా  డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది.

ఏఆర్ జీవా దర్శకత్వం వహించిన లాక్‌డౌన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్‌స్టన్, ఇందుమతి, రాజ్‌కుమార్, శ్యామ్‌జీ, లోలు సభా మారన్, వినాయక్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

కోలీవుడ్ నుంచి  కార్తి నటించిన  ‘వా వాతియార్’ కూడా రిలీజ్ కు రెడీగా ఉంది డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. నలన్ కుమారసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి, సత్యరాజ్, రాజకిరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

స్టార్ హీరోల భారీ చిత్రాలు

సౌత్ సూపర్‌స్టార్ మమ్ముట్టి ‘కలమకవల్’ ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా. దీనికి జితిన్ కె జోస్ దర్శకత్వం వహించారు. ఈసినిమా  డిసెంబర్ 5న విడుదల కానుంది. మలయాళంలో ఈసినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించిన ‘అంగమ్మాళ్’ చిత్రంలో గీతా కైలాసం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆమెతో పాటు శరన్ శక్తి, తెండ్రాల్ రఘునాథన్, భరణి కూడా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈసినిమాతో పాటు  దర్శన్ ‘ది డెవిల్’  అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. దీనికి ప్రకాష్ రచన, దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

డిసెంబర్ చివరి వారంలో సందడి చేయనున్న సినిమాలు

విఘ్నేష్ శివన్ సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ డిసెంబర్ 18న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కృతి శెట్టి  ఈసినిమాలో  హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈసినిమాతో పాటు అరుణ్ విజయ్ హీరోగా నటించిన  ‘రెట్టా తలా’ కూడా డిసెంబర్ 18న విడుదల కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి క్రిస్ తిరుకుమారన్ దర్శకుడు. ఇందులో సిద్ధి ఇద్నాని, తాన్య రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సూపర్‌స్టార్ దిలీప్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్-కామెడీ చిత్రం ‘భాభాబా’ డిసెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ధనంజయ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ కూడా ఒక చిన్న పాత్ర పోషించారు. ఇక డిసెంబర్ 25 న రిలీజ్ కాబోతోంది మరో మలయాళ సినిమా  ‘సర్వమయమ్’. నివిన్ పౌలీ నటించిన ఈ మలయాళ ఫాంటసీ కామెడీ-హారర్ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రానికి అఖిల్ సత్యన్ దర్శకత్వం వహించారు. ఇందులో అజు వర్గీస్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

మొత్తంగా డిసెంబర్ నెల సినీ ప్రేమికులకు భారీ వినోదాన్ని అందించనుంది. స్టార్ హీరోల చిత్రాలు, విభిన్న కథాంశాలతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయబడటం ఖాయం. ఈ పోటీలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.