|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంక్రాంతి రసవత్తర పోరు: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ.. రవితేజకు శర్వా షాక్ ఇస్తాడా?

Published: 22-12-2025, 9:44 AM
సంక్రాంతి రసవత్తర పోరు: 'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ.. రవితేజకు శర్వా షాక్ ఇస్తాడా?
  • ‘నారీ నారీ నడుమ మురారి’ జనవరి 14న సంక్రాంతికి విడుదల కానుంది.
  • శర్వానంద్ త్రికోణ ప్రేమకథతో కూడిన ఈ టీజర్ ఫన్ రైడ్‌లా ఉంది.
  • చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు.
  • రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో శర్వా పోటీ, థీమ్స్ మధ్య పోలిక.

సంక్రాంతి బాక్సాఫీస్ పై టాలీవుడ్ హీరోల యుద్ధం కొనసాగుతోంది. శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ విడుదలైంది. త్రికోణ ప్రేమకథతో వస్తున్న ఈ చిత్రం రవితేజ సినిమాతో పోటీ పడుతోంది. ఈ పోరులో ఎవరికి డ్యామేజ్ తప్పదో చూడాలి.

‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ ఎలా ఉంది?

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ పై టాలీవుడ్ హీరోల ముప్పేట దాటి తప్పేలా లేదు. అగ్ర హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు సంక్రాంతికి తమ సినిమాలని దించుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ రాజా సాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు లాంటి సినిమాలు సంక్రాంతికి బెర్తులు ఖారారు చేసుకున్నాయి. వీరందరితో పాటు శర్వానంద్ కూడా సంక్రాంతి రేసులో మధ్యలో దూరేశాడు.

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి చిత్రం జనవరి 14న రిలీజ్ అవుతోంది. తాజాగా విడుదలైన టీజర్ తో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. మరి టీజర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడిగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.

శర్వానంద్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ!

టీజర్ మొత్తం ఫన్ రైడ్ లా ఉంది. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే కుర్రాడిగా శర్వా కనిపిస్తున్నాడు. సంయుక్త మీనన్ అతడి ఎక్స్ లవర్. ఎక్స్ లవర్ పక్కన ఉండగానే మరో అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇలా ట్రైయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కామెడీ పంచ్ డైలాగులు బాగా పేలుతున్నాయి.

‘ఏం సుడిగాడివిరా నువ్వు ఒకే ఆఫీస్ లో ఎక్స్, ప్రజెంట్ ఇద్దరూ’ అంటూ కమెడియన్ సుదర్శన్ చెబుతున్న డైలాగ్.. నిత్యాకి తెలిసిందంటే మీ ఇద్దరినీ బతుకు జట్కాబండిలో కూర్చోబెడుతుందిరా అంటూ నరేష్ చెబుతున్న డైలాగ్ నవ్వులు పూయించేలా ఉన్నాయి. నవ్వులు బాగా పండితే ఈ చిత్రం విజయం సాధించే అవకాశం ఉంది.

సంక్రాంతి పోరు: రవితేజతో శర్వా ఢీ!

అయితే ఇక్కడ ఒక పెద్ద రిస్క్ ఉంది. శర్వానంద్ ఏకంగా రవితేజతో పోటీ పడుతుంది. రవితేజ నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఈ సినిమా థీమ్ కూడా ఇలాగే కనిపిస్తోంది. ఈ చిత్రంలో రవితేజ తన భార్య, లవర్ మధ్య నలిగిపోతుంటే.. నారీ నారీ నడుమ మురారిలో శర్వా ఎక్స్ లవర్, ప్రెజెంట్ లవర్ మధ్య నలిగిపోతున్నాడు. పైగా రెండు సినిమాలు ఒకరోజు గ్యాప్ లో రిలీజ్ అవుతున్నాయి. దీనితో ఎవరి సినిమా ఎవరిని డ్యామేజ్ చేస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.

మొత్తానికి, ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. సంక్రాంతికి రవితేజ సినిమాతో నేరుగా పోటీ పడుతుండటం ఉత్కంఠను పెంచుతోంది. ఈ రెండు చిత్రాలలో ఏది విజయం సాధిస్తుందో, ఏది నష్టపోతుందో కాలమే నిర్ణయిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.