
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మరియు బాలీవుడ్ నటి దీపిక పదుకొణే మధ్య గొడవ జరుగుతోంది. ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ వివాదం ఇందుకు కారణం. బాలీవుడ్ మీడియా ఇప్పుడు దీపికకు మద్దతుగా వీడియోను విడుదల చేసింది.
Key Points
సందీప్ రెడ్డి వంగ, దీపిక పదుకొణే మధ్య గొడవ సోషల్ మీడియాలో హాట్ టాపిక్.
‘స్పిరిట్’ సినిమాలో దీపిక రెమ్యునరేషన్ వివాదం.
దీపిక తన ట్రాక్ రికార్డ్ గురించి, ఆమె అర్హతను గుర్తించాలని తెలిపింది.
బాలీవుడ్ మీడియా దీపికకు మద్దతుగా ఆరు సంవత్సరాల కిందటి వీడియోను వైరల్ చేసింది.
దీపిక పదుకొణే-సందీప్ రెడ్డి వంగ గొడవ
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ-దీపికా పదుకొణే గొడవ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పనికిరాని పీఆర్ స్టంట్స్ వేసిందని సినిమా లవర్స్ గట్టిగానే ట్రోల్ చేశారు. అయితే బాలీవుడ్ మీడియా ఆమెకు సపోర్ట్ చేస్తూ ఓ వీడియోను వైరల్ చేస్తోంది. డైరెక్టర్‌కు దీపిక అఫిషియల్ సమాధానం ఇదేనంటూ +క్లిపింగ్ రిలీజ్ చేసింది. అసలు ఇందులో ఏముంది? ఏం మాట్లాడింది? అసలు ఈ వీడియో ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతోంది? చూద్దాం.
‘స్పిరిట్’ సినిమా రెమ్యునరేషన్ వివాదం
‘స్పిరిట్’ హీరోయిన్‌గా, ప్రభాస్‌కు జోడీగా దీపికను కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ముందుగా అడిగిన రెమ్యూనరేషన్‌కు ఓకే చేశారు. కానీ ఆ తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ, డెలివరీతో బిజీ అయిపోయింది. సెట్ అయ్యాక షూట్ చేద్దామనే టైంకి 40 కోట్ల రెమ్యూనరేషన్, ప్రాఫిట్ షేర్, నచ్చిన వర్కింగ్ హవర్స్ కండిషన్స్‌తో విసిగిపోయిన మేకర్స్.. ఆమెను తీసేశారు. త్రిప్తి దిమ్రిని హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే ఇది నచ్చని హీరోయిన్ పీఆర్ స్టంట్స్ స్టార్ట్ చేసింది. కథే బాగాలేదని చెప్పేసింది. దీంతో సందీప్ రెడ్డి ఫైర్ అయ్యాడు.
దీపిక అఫీషియల్ స్టేట్మెంట్
అయితే దీనిపై దీపిక అఫిషియల్ ఆన్సర్ ఇదే అంటూ ఆరు సంవత్సరాల కిందటి వీడియోను వైరల్ చేస్తుంది బాలీవుడ్ మీడియా. ‘నేను ఒక సినిమా కమిట్ అయ్యా. క్రియేటివిటీ పరంగా ఓకే అనుకున్నా. నాకు కావాల్సిన మనీ డిమాండ్ చేశా. కానీ డైరెక్టర్ హీరోకు మేము ఇంత ఇస్తున్నాం. కాబట్టి మీకు ఇవ్వలేం అని చెప్పాడు. దీంతో దట్స్ ఓకే బైబై టాటా అని చెప్పేశా. ఎందుకంటే నాకు నా ట్రాక్ రికార్డ్ తెలుసు. నా వాల్యూ తెలుసు. అలాంటప్పుడు నా అర్హతను తగ్గించుకుని సినిమా చేస్తే నిద్రలేని రోజులు గడపాల్సి వస్తుంది’ అని తెలిపింది దీపిక.
దీపిక పదుకొణే తన నిర్ణయంపై స్పష్టతనిచ్చింది. ఆమె ట్రాక్ రికార్డ్, అర్హతను గుర్తించాలని కోరింది. ఈ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


