
ప్రముఖ టీవీ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లోకి రెండు పెద్ద సెన్సేషన్ దర్శకులు ఆర్జీవీ మరియు సందీప్ రెడ్డి వంగ ఎంట్రీ ఇచ్చారు. జగపతి బాబుతో కలిసి వారు చేసిన సరదా ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Key Points
జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' షోలో ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగ పాల్గొన్నారు.
ఇద్దరు ప్రముఖ దర్శకులు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ప్రోమో వైరల్ గా మారింది.
సందీప్ రెడ్డి వంగ ఆర్జీవీని తనకు ఇష్టమైన దర్శకుడిగా పేర్కొన్నారు.
ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 7న రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం అవుతుంది.
జయమ్ము నిశ్చయమ్మురా షోలో సందడి
RGV Sandeep Vanga : జగపతి బాబు ప్రస్తుతం జయమ్ము నిశ్చయమ్మురా అనే టీవీ షో హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. జీ తెలుగులో ఈ షో ప్రతి ఆదివారం టెలికాస్ట్ అవుతుంది. తాజాగా ఈ షోకి గెస్టులుగా సెన్సేషనల్ డైరెక్టర్స్ ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగ వచ్చి సందడి చేసారు.(RGV Sandeep Vanga)
ఇలాంటి ఇద్దరు డైరెక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో కనపడి అల్లరి చేసి సరదాగా నవ్వడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. సందీప్ ఆర్జీవీ తన ఫేవరేట్ డైరెక్టర్ అని చాలా సార్లు చెప్పాడు. దీంతో ఈ ఇద్దరు బోల్డ్ డైరెక్టర్స్ కలిసి షోలో ఏం చెప్పారో, ఎలా సందడి చేశారు చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదు రుచూడాల్సిందే. ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది.
ఆర్జీవీ మరియు సందీప్ రెడ్డి వంగ కలిసి
మీరు కూడా జగపతి బాబు హోస్ట్ గా సందీప్ రెడ్డి వంగ, రామ్ గోపాల్ వర్మ వచ్చిన షో ప్రోమో చూసేయండి..
వైరల్ అయిన ప్రోమో
ఆర్జీవీ మరియు సందీప్ రెడ్డి వంగల కామెడీ, సరదాలతో నిండిన ఈ ఎపిసోడ్‌ని సెప్టెంబర్ 7వ తేదీన జీ తెలుగులో వీక్షించండి. మిస్ చేయకండి!


