
బాలీవుడ్‌లో ప్రముఖ నటి దీపికా పదుకొనే గురించి షాకింగ్ వార్త బయటపడింది. నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం తనతో దీపికా రెండేళ్లు డేటింగ్ చేసిందని, ఆమెనే మొదట ప్రపోజ్ చేసిందని వెల్లడించారు.
Key Points
ముజమ్మిల్ ఇబ్రహీం దీపికా పదుకొనేతో రెండేళ్లు ప్రేమాయణం నడిచిందని వెల్లడించారు.
దీపికా పదుకొనేనే మొదట ప్రపోజ్ చేసిందని ముజమ్మిల్ తెలిపారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల దీపికాను వదిలేశానని ముజమ్మిల్ పేర్కొన్నారు.
ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ముజమ్మిల్ ఇబ్రహీం చేసిన సంచలన వెల్లడి
సినిమా ఇండస్ట్రీ ( Film industry) అంటేనే పెద్ద సముద్రం. ఇందులో హిట్స్, ఫ్లాప్స్ తో హీరో, హీరోయిన్ల మధ్య రిలేషన్లు కూడా ఉంటాయి. ఇందులో కొంతమంది రిలేషన్ పెట్టుకొని… పెళ్లి చేసుకుంటే మరి కొంత మంది… పని అయిపోయాక వదిలేస్తారు. లేదా చిన్న చిన్న కారణాలవల్ల.. బ్రేకప్ చెప్పుకుంటారు. అయితే తాజాగా..దీపికా పదుకొనే ( Deepika Padukone) గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ హీరో ముజమ్మిల్ ఇబ్రహీం.
రెండేళ్ల ప్రేమాయణం: దీపికా-ముజమ్మిల్
ఢోకా సినిమాతో స్టార్ హీరోగా మారిన… ముజమ్మిల్ ఇబ్రహీం ( Muzammil Ibrahim) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని… దీపికా పదుకొనే గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. దీపిక పదుకొనేతో 2018 వరకు ప్రేమాయణం నడిచిందని వెల్లడించాడు. దాదాపు తామిద్దరం రెండు సంవత్సరాలు ప్రేమించుకున్నట్లు స్పష్టం చేశాడు ముజమ్మిల్ ఇబ్రహీం.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్
తనకు మొదట దీపిక పదుకొనే ప్రపోజ్ చేసిందని కూడా స్పష్టం చేశాడు. దీపిక పదుకొనే తోనే తన మొదటి లవ్ ప్రారంభమైందని వెల్లడించాడు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల దీపిక పదుకొనేను నేనే వదిలేసానని.. బాంబు పేల్చాడు ముజమ్మిల్ ఇబ్రహీం. దీంతో ఇప్పుడు ముజమ్మిల్ ఇబ్రహీం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
ముజమ్మిల్ ఇబ్రహీం చేసిన ఈ వెల్లడి సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. దీపికా పదుకొనే ప్రతిస్పందన ఇంకా తెలియాల్సి ఉంది.


