|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Deepika Padukone: నేనొక బిడ్డకు జన్మనిచ్చాను.. ఆ కాన్సర్న్ కూడా లేదా.. మరోసారి హాట్ కామెంట్స్ చేసిన దీపికా

Published: 16-11-2025, 10:11 PM
Deepika Padukone: నేనొక బిడ్డకు జన్మనిచ్చాను.. ఆ కాన్సర్న్ కూడా లేదా.. మరోసారి హాట్ కామెంట్స్ చేసిన దీపికా

బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే తన పని వేళలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను తల్లి అయిన తర్వాత వృత్తి, పిల్లల పెంపకం బ్యాలెన్స్ చేయడం కష్టమని, 8 గంటల పని అవసరమని గట్టిగా సమర్థించుకుంది. ఈ వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.

Key Points

1

దీపికా పదుకొనే 8 గంటల పని నియమం కారణంగా రెండు ప్రభాస్ సినిమాల నుండి తప్పుకుంది.

2

తాజాగా మాతృత్వం గురించి ప్రస్తావిస్తూ తన 8 గంటల పని నిర్ణయాన్ని సమర్థించుకుంది.

4

ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో 'కింగ్' సినిమా చేస్తోంది, టీజర్ విడుదల కాగా వచ్చే ఏడాది రానుంది.

దీపికా 8 గంటల పని వివాదం

Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఇటీవల న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతోంది. దానికి కారణం పని చేసే సమయంపై ఆమె చేసిన కామెంట్స్. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తాను అంటూ ఆమె పెట్టిన కండీషన్ గత కొంతకాలంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో (Deepika Padukone)సంచలనంగా మారింది. ఈ కండీషన్ కారణంగా ఆమె రెండు భారీ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ రెండు కూడా ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాలే కావడం విశేషం. అందులో ఒకటి కల్కి 2 కాగా, మరొకటి స్పిరిటి సినిమా. ఈ రెండు సినిమాల నుంచి దీపికాను తప్పిస్తూ అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. దీంతో ఈ వివాదం ముగిసింది అనుకున్నారు అంతా.. కానీ మరోసారి ఈ టాపిక్ వైరల్ గా మారింది.

SriDevi: కోర్టు బ్యూటీకి బంపర్ ఆఫర్.. తమిళంలో క్రేజీ సినిమా.. హీరో ఎవరో తెలుసా?

మాతృత్వం తర్వాత దీపికా వ్యాఖ్యలు

తాజాగా మరోసారి ఈ టాపిక్ గురించి ప్రస్తావించింది దీపికా. “ఇప్పుడు నేనో బిడ్డకు తల్లిని. తల్లిని అయ్యాక మా అమ్మగారిపై మరింత గౌరవం పెరిగింది. నిజం చెప్పాలంటే వృత్తి జీవితాన్ని, పిల్లల పెంపకాన్ని బ్యాలెన్స్‌ చేయడం చాలా కష్టమైన పని. కొత్తగా బిడ్డకు జన్మను ఇచ్చి తిరిగి వర్క్ కోసం వచ్చిన వారికి సపోర్ట్‌ చేయడం అనేది ఖచ్చితంగా అవసరం. రోజుకి 8 గంటల పని చేయడం అనేది శరీరానికి, మనసుకు మంచిది. ఆరోగ్యంగా ఉండి పని చేసినప్పుడే అవుట్‌పుట్‌ బాగుంటుంది. ఒత్తిడితో పనిచేయడం సరికాదు.

ప్రస్తుత ప్రాజెక్ట్‌లు

మా ఆఫీసులో కూడా కేవలం 8 గంటలే పని చేస్తాం. టైమ్‌ అనేది ధనంతో సమానం. దాన్ని ఎవరితో, ఎలా స్పెండ్‌ చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు లేదా. నిజమైన సక్సెస్‌ అంటే ఇదే. ఇప్పటికీ చెప్తున్నా 8 గంటలు పని చేయాలనే నా నిర్ణయం కరెక్టే” అంటూ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె షారుఖ్ ఖాన్ తో ఆమె కింగ్ సినిమా చేస్తోంది. సిద్దార్థ్ ఆనంద్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై భారీ హైప్ కక్రియేట్ చేసింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పని వేళలపై దీపికా పదుకొనే వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. మాతృత్వం తర్వాత ఆమె దృక్పథం, వ్యక్తిగత స్వేచ్ఛపై ఆమె అభిప్రాయాలు ఆసక్తికరంగా మారాయి. ఇది ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.