|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దీపికా పదుకొనె తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా? 16ఏళ్ల క్రితమే ఎంట్రీ, కానీ

Published: 02-11-2025, 6:24 PM
దీపికా పదుకొనె తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా? 16ఏళ్ల క్రితమే ఎంట్రీ, కానీ

దీపికా పదుకొనె `కల్కి 2898 ఏడీ` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమని అందరూ అనుకుంటారు. కానీ ఆమె టాలీవుడ్‌లోకి 16 ఏళ్ల క్రితమే అడుగుపెట్టింది. ఓ ఐటెమ్ సాంగ్ ద్వారా ఎంట్రీ ఇవ్వగా, ఆ సినిమా విడుదల కాలేదు. దీపికా నిజమైన మొదటి తెలుగు సినిమా గురించి పూర్తి వివరాలు ఇక్కడ.

Key Points

1

దీపికా పదుకొనె `కల్కి 2898 ఏడీ`తో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

2

`లవ్ 4 ఎవర్‌` మూవీలో 16 ఏళ్ల క్రితమే ఓ ఐటెమ్ సాంగ్‌ చేసింది.

4

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో మరో సైన్స్ ఫిక్షన్ చిత్రంలో కనిపించనుంది.

బాలీవుడ్‌లో దీపికా స్టార్‌డమ్, టాలీవుడ్‌ ఎంట్రీ

కన్నడ హీరోయిన్లు భారతీయ సినిమాని షేక్‌ చేస్తున్నారు. అలా ఊపేసిన హీరోయిన్లలో దీపికా పదుకొనె కూడా ఒకరు. ఆమె బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. హిందీలో దాదాపు అందరు సూపర్ స్టార్స్ తోనూ సినిమాలు చేసి మెప్పించింది. ప్రస్తుతం అక్కడ అత్యధిక పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్‌గా దీపికా పదుకొనె నిలవడ విశేషం. అంతేకాదు బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌తో ప్రేమలో పడింది. ఆయన్నే పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు ఉన్నారు.

ఇదిలా ఉంటే దీపికా పదుకొనె గతేడాది `కల్కి 2898 ఏడీ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా రూపొందిన ఈ మూవీకి నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. ఇందులో భారీ కాస్టింగ్‌ నటించింది. అమితాబ్‌ బచ్చన్‌, దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్ ఠాకూర్‌, విజయ్‌ దేవరకొండ వంటి వారు గెస్ట్ లుగా మెరిసిన విషయం తెలిసిందే. ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది. దీనికి రెండో పార్ట్ రాబోతుంది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం నుంచి దీపికా పదుకొనె తప్పుకుంది. చిత్ర బృందమే ఈ విషయాన్ని వెల్లడించింది.

కల్కికి ముందే దీపికా తొలి తెలుగు సినిమా

మరోవైపు తెలుగులో మరో మూవీకి కమిట్‌ అయ్యింది దీపికా. అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్‌ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది దీపికా. ఇందులో ఆమె వారియర్‌ క్వీన్‌గా కనిపించనుందని సమాచారం. ఈ మూవీ త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. సీజీ వర్క్ ఎక్కువగా ఉండటంతో, వాటికి సంబంధించిన ముందస్తు పనుల్లో బిజీగా ఉన్నారు.

అయితే దీపికా పదుకొనె తెలుగులో నటించిన తొలి చిత్రం `కల్కి` కాదు, దీనికంటే ముందే మరో సినిమాలో నటించింది. 16ఏళ్ల క్రితమే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఆ మూవీనే `లవ్‌ 4 ఎవర్‌`. ఈ మూవీకి జయంత్‌ సి పరాన్జీ దర్శకుడు. మృదుల, రన్‌దీప్‌ జంటగా నటించారు. ఈ మూవీని 2009లో రూపొందించారు దర్శకుడు జయంత్‌.

రాబోయే దీపికా తెలుగు ప్రాజెక్టులు

ఈ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ కోసం దీపికా పదుకొనెని తీసుకున్నారు. ఆమెపై షూటింగ్‌ కూడా చేశారు. చాలా వరకు సినిమా చిత్రీకరణ పూర్తయ్యిందని సమాచారం. కానీ పలు కారణాలతో మూవీ రిలీజ్‌ కాలేదు. అలా పదహారేళ్ల క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సిన దీపికా పదిహేనేళ్ల తర్వాత `కల్కి 2898 ఏడీ` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెకిది బెస్ట్ ఎంట్రీ అని చెప్పొచ్చు.

మొత్తం మీద, దీపికా పదుకొనె తెలుగు ఎంట్రీ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. `కల్కి` ముందు ఆమె చేసిన ప్రయత్నం వెలుగు చూడకపోయినా, ఇప్పుడు ఆమె స్టార్ హీరోయిన్‌గా తెలుగులో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలతో ప్రేక్షకులను అలరించనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.