
📌 Key Points
- దీపికా పదుకొణె సోదరి అనీషా పదుకొణె త్వరలో పెళ్లి చేసుకోనుందని వార్తలు.
- వ్యాపారవేత్త రోహన్ ఆచార్యను అనీషా పదుకొణె వివాహం చేసుకోనుందని మీడియా కథనాలు.
- రోహన్ ఆచార్య ప్రముఖ నిర్మాత బిమల్ రాయ్ మని మనవడు; దిశా ఆచార్య సోదరుడు.
- రణ్‌వీర్ సింగ్, రోహన్ ఆచార్య కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేవారు.
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె చెల్లెలు అనీషా పదుకొణె త్వరలో పెళ్లి చేసుకోనుందని మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రోహన్ ఆచార్య అనే వ్యాపారవేత్తతో ఆమె వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ అంశం దీపికా అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతోంది.
అనీషా పదుకొణె పెళ్లి వార్త నిజమేనా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె సోదరి అనీషా పదుకొణె త్వరలో పెళ్లి చేసుకోనుందని డెక్కన్ క్రానికల్ మీడియా తెలిపింది. అయితే, అనీషా పెళ్లిపై దీపికా కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని సమాచారం. కాకపోతే అనీషా పెళ్లి చేసుకునే రోహన్ ఆచార్య ఎవరు అనే అంశం ఆసక్తిగా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కల్కి 2898 ఏడీ బ్యూటీ దీపికా పదుకొణె ఇంట్లో పెళ్లి సందడి మొదలు కానుంది. దీపికా పదుకొణె చెల్లెలు అనీషా పదుకొణె త్వరలో పెళ్లి చేసుకోనుందని డెక్కన్ క్రానికల్ మీడియా తెలిపింది. అయితే, అనీషా వివాహ విషయంపై దీపికా కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఎవరీ రోహన్ ఆచార్య? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
అనీషా పదుకొణె వ్యాపారవేత్త రోహన్ ఆచార్యను పెళ్లి చేసుకోనుందని హిందీ మీడియా పేర్కొంది. హిందీ దిగ్గజ నిర్మాత బిమల్ రాయ్ మని మనవడు ఈ రోహన్ ఆచార్య. అలాగే, రోహన్ ఆచార్య బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్‌ను వివాహం చేసుకున్న దిశా ఆచార్య సోదరుడు.
కాగా అనీషా, రోహన్ తమ లవ్ రిలేషన్‌ను చాలా సీక్రెట్‌గా ఉంచారు. రోహన్ ఆచార్య కుటుంబానికి దీపికా భర్త రణ్‌వీర్ సింగ్ చాలా క్లోజ్‌గా ఉండేవాడు. రోహన్ ఫ్యామిలీతో రణ్‌వీర్ సింగ్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేవి. అప్పుడు అనీ, రోహన్‌పై లవ్ ట్రాక్ రూమర్స్ వచ్చేవి. కానీ, వాటికి ఇద్దరూ రియాక్ట్ అయ్యేవారు కాదు.
దీపికా, రణ్‌వీర్ కుటుంబంతో సంబంధాలు
కాగా, గతంలో హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో చెల్లి గురించి దీపికా మాట్లాడుతూ.. “అనీషా తెగ మాటకారి. మాట్లాడుతూనే ఉంటుంది. కానీ, తాను చెప్పాలనుకుంది చాలా చాలా స్పష్టంగా, అతి సున్నితంగా చెబుతుంది. అవతలి వ్యక్తిని బాధించకుండా తన అభిప్రాయాలను ఎలా చెప్పాలో ఆమెకు తెలుసు” అని తెలిపింది.
ఇదిలా ఉంటే, యాక్షన్ కామెడీ చిత్రాల డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింఘం ఎగైన్’ మూవీలో దీపికా పదుకొణె చివరి సారిగా కనిపించింది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తదితరులు నటించారు. ఇది గత ఏడాది థియేటర్లలో విడుదలై ఆకట్టుకోలేదు.
దీపికా కుటుంబం నుంచి పెళ్లిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అనీషా, రోహన్ ఆచార్యల ప్రేమ బంధంపై మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి. ఈ వివాహంతో పదుకొణె కుటుంబంలో కొత్త సందడి నెలకొననుంది.


