|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Demon Pavan: రీతూ కంటే వాళ్లిద్దరూ హౌస్ లో ఉండడమే పవన్ కి ఇష్టమా.. తనూజపై నమ్మకం లేదంటూ

Published: 13-12-2025, 6:48 AM
Demon Pavan: రీతూ కంటే వాళ్లిద్దరూ హౌస్ లో ఉండడమే పవన్ కి ఇష్టమా.. తనూజపై నమ్మకం లేదంటూ
  • బిగ్ బాస్ తెలుగు 9 చివరి దశకు చేరుకోగా, టాప్ 5 పై ఆసక్తికర అంచనాలు.
  • రీతూ లేకుండా ఈ వారం బావుందని డిమాన్ పవన్ వ్యాఖ్యానించారు, అయేషా, రమ్య ఉంటే ఇంకా బావుండేదని అన్నారు.
  • నమ్మకం ఉన్న, లేని వారిని గుర్తించే టాస్క్ ఇంటి సభ్యులకు ఇచ్చిన నాగార్జున.
  • సంజన తనూజకు రెడ్ ఫ్లాగ్ ఇస్తూ.. హౌస్ లో తాను తనూజని ఎప్పటికీ నమ్మలేనని తెలిపింది.

బిగ్ బాస్ తెలుగు 9 చివరి దశకు చేరుకోగా, ఇంటి సభ్యుల మధ్య ఉత్కంఠ నెలకొంది. రీతూ లేకుండా ఈ వారం బావుందని డిమాన్ పవన్ చెప్పగా, నాగార్జున ఇచ్చిన నమ్మకం టాస్క్‌లో సంజన తనూజపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

డిమాన్ పవన్ కామెంట్స్: రీతూ లేకుంటేనే బెటర్!

బిగ్ బాస్ తెలుగు 9 షో చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. టాప్ 5, విన్నర్ విషయంలో ఆడియన్స్ నుంచి కొన్ని అంచనాలు వినిపిస్తున్నాయి. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ లలో ఒకరు టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. వీకెండ్ ప్రారంభం కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

శనివారం కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. డిమాన్ పవన్ పై నాగార్జున సెటైర్లు వేస్తున్నారు. హౌస్ లో రీతూ చౌదరి లేకపోయే సరికి పవన్ అందరిని బాగా కలుస్తున్నాడు మాట్లాడుతున్నాడు అని అన్నారు. నిజంగానే రీతూ లేకుండా ఈ వారం చాలా బావుంది. బాగా ఎంజాయ్ చేశా అని పవన్ చెప్పాడు. దీనితో నాగార్జున నవ్వేశారు.

నాగార్జున టాస్క్: నమ్మకస్తులు ఎవరు, నమ్మకం లేని వారు ఎవరు?

వెంటనే సంజన స్పందిస్తూ.. అయేషా, రమ్య హౌస్ లో ఉండిఉంటే ఇంకా బావుండేది అని కూడా పవన్ చెప్పాడు అని తెలిపింది. వాళ్లిద్దరూ ఉండిఉంటే రచ్చ రంబోలా అని చెప్పాడట.

సరదా కామెంట్స్ ముగిసిన తర్వాత నాగార్జున ఇంటి సభ్యులకు ఓ టాస్క్ పెట్టారు. ఒక్కొక్కరు ఇంట్లో తమకి నమ్మకమైన వారు ఎవరు.. నమ్మకం లేని వారు ఎవరు అనేది చెప్పాలని అడిగారు. నమ్మకం ఉన్నవాళ్లకు గ్రీన్ ఫ్లాగ్, నమ్మకం లేనివాళ్లకు రెడ్ ఫ్లాగ్ ఇవ్వాలి.

తనూజపై నమ్మకం లేదని స్పష్టం చేసిన సంజన

ముందుగా సంజన.. ఇమ్మాన్యుయేల్ కి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చింది. తనకి ఇమ్మాన్యుయేల్ అంటే నమ్మకం అని చెప్పింది. రెడ్ ఫ్లాగ్ ని తనూజకి ఇస్తూ.. హౌస్ లో తాను తనూజని ఎప్పటికీ నమ్మలేను అని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనూజతో నాకు బాండింగ్ అంతగా లేదు. ఈ వారం విభేదాలు మరింత పెరిగాయి అని సంజన పేర్కొంది. భరణి మాట్లాడుతూ తనకి హౌస్ లో నమ్మకస్తుడు సుమన్ శెట్టి అని, డిమాన్ పవన్ పై నమ్మకం లేదు అని తెలిపారు.

మొత్తానికి, బిగ్ బాస్ ఇంట్లో ఆట చివరి దశకు చేరే కొద్దీ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. పవన్, సంజన వంటి వారి వ్యాఖ్యలు హౌస్‌లో ఆసక్తిని రేకెత్తించాయి. రాబోయే ఎలిమినేషన్ ఎవరు అనేది మరిన్ని మలుపులకు దారితీస్తుందేమో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.