
📌 Key Points
- నెట్‌ఫ్లిక్స్‌లో ఇమ్రాన్ హష్మి ‘తస్కరీ’ వెబ్ సిరీస్ సంచలనం, గ్లోబల్ ట్రెండింగ్‌లో నంబర్ వన్!
- కేవలం వారంలోనే 5.4 మిలియన్ వ్యూస్‌తో కొరియన్ షోలను దాటేసిన ‘తస్కరీ’ రికార్డు!
- నాన్-ఇంగ్లీష్ షోల జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలిచిన ఏకైక ఇండియన్ వెబ్ సిరీస్‌గా ‘తస్కరీ’ ఘనత!
- ఎయిర్‌పోర్ట్ అధికారుల గౌరవార్ధం తీసిన ఈ కథకు ప్రేక్షకుల బ్రహ్మాండమైన ఆదరణ!
క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారికి ఇది నిజంగా పండగే. ఇమ్రాన్ హష్మి నటించిన ‘తస్కరీ’ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిందో లేదో.. అప్పుడే గ్లోబల్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో ‘తస్కరీ’ సునామీ
నెట్‌ఫ్లిక్స్‌లోకి తాజాగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దుమ్ము రేపుతోంది. గ్లోబల్ లెవెల్లో నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం. ఇమ్రాన్ హష్మి లీడ్ రోల్లో నటించిన వెబ్ సిరీస్ ఇది.
నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈ మధ్యే వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చినా ఇప్పుడు మాత్రం దుమ్ము రేపుతోంది. ఇప్పటి వరకూ ఈ ఓటీటీలో వచ్చిన ఈ ఇండియన్ వెబ్ సిరీస్‌కూ దక్కని ఘనతను సొంతం చేసుకుంది. మరి అదేంటో చూడండి.
తస్కరీ వెబ్ సిరీస్ రికార్డు
కొరియన్ షోలకు షాక్ ఇచ్చిన ‘తస్కరీ’
ఇది కొరియన్ షోలను దాటి నంబర్ 1గా నిలవడం విశేషం. నెట్‌ఫ్లిక్స్ డేటా విభాగం ‘టుడుమ్’ (Tudum) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత వారం అంటే జనవరి 12 నుంచి 18 మధ్య ప్రపంచవ్యాప్తంగా నాన్-ఇంగ్లిష్ షోల జాబితాలో ‘తస్కరీ’ మొదటి స్థానంలో నిలిచింది. ఈ వెబ్ సిరీస్ కేవలం వారంలోనే 5.4 మిలియన్ల (54 లక్షలు) వ్యూస్ సాధించింది.
పాపులర్ కొరియన్ రొమాంటిక్ కామెడీ ‘కెన్ దిస్ లవ్ బి ట్రాన్స్‌లేటెడ్?’ (4 మిలియన్ల వ్యూస్)ను వెనక్కి నెట్టి మరీ తస్కరీ టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. జుజుత్సు కైసెన్, ఆల్ఫా మేల్స్ వంటి అంతర్జాతీయ షోలను కూడా ఇది అధిగమించింది. టాప్-10లో ఉన్న ఏకైక ఇండియన్ వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం.
తస్కరీ వెబ్ సిరీస్ విశేషాలు
ఇమ్రాన్ హష్మి సక్సెస్ సీక్రెట్ ఇదేనా?
తమ వెబ్ సిరీస్ సాధించిన ఈ విజయంపై ఇమ్రాన్ హష్మీ స్పందిస్తూ.. “ఎయిర్‌పోర్ట్‌లో అవిశ్రాంతంగా పనిచేసే అధికారుల పట్ల గౌరవంతో ఈ కథను రూపొందించాం. నిజాయితీగా చెప్పిన కథలు ఎక్కడి వరకైనా వెళ్తాయని ఈ విజయం నిరూపించింది” అని అన్నాడు.
దర్శకుడు నీరజ్ పాండే మాట్లాడుతూ.. “గ్లోబల్ టాప్ 10లో ఒక ఇండియన్ వెబ్ సిరీస్ నంబర్ 1గా నిలవడం కేవలం ఈ షో విజయమే కాదు, ఇండియన్ స్టోరీలకు దక్కిన గౌరవం” అని ఆనందం వ్యక్తం చేశాడు.
‘తస్కరీ’ వెబ్ సిరీస్ సృష్టిస్తున్న సంచలనం గురించి విన్నారుగా. ఇమ్రాన్ హష్మి ఖాతాలో మరో హిట్ చేరింది. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


