|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దటీజ్ డిప్యూటీ సీఎం, బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ అయ్యాయి.. ఇదే లాస్ట్ ఛాన్స్

Published: 09-10-2025, 4:11 AM
దటీజ్ డిప్యూటీ సీఎం, బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ అయ్యాయి.. ఇదే లాస్ట్ ఛాన్స్

కాలుష్యం కారణంగా బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 హౌస్ సీజ్ అవ్వడంతో షో భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. అయితే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చొరవతో బిగ్ బాస్ డోర్లు మళ్ళీ తెరుచుకున్నాయి. ఈ వివాదం, దాని పరిష్కారం గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Key Points

1

బిగ్ బాస్ కన్నడ హౌస్‌ను కాలుష్య నియంత్రణ మండలి సీజ్ చేసింది.

2

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జోక్యంతో హౌస్ డోర్లు మళ్ళీ తెరుచుకున్నాయి.

4

కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే స్టూడియోపై కఠిన చర్యలు తప్పవు.

బిగ్ బాస్ కన్నడ హౌస్ సీజ్ వెనుక కారణం

స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 ఇటీవల మూత పడిన సంగతి తెలిసిందే. మంగళవారం రోజు కన్నడ బిగ్ బాస్ హౌస్ ని కాలుష్య నియంత్రణ మండలి సీజ్ చేసింది. కంటెస్టెంట్లు అందరినీ బయటకి పంపేశారు. ఇది పెద్ద గందరగోళానికి దారితీసింది. దీనితో బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 ఉంటుందా ? పూర్తిగా రద్దవుతుందా అనే అనుమానాలు పెరిగాయి. కానీ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చొరవతో బిగ్ బాస్ హౌస్ డోర్లు మళ్ళీ తెరుచుకున్నాయి.

దీనితో బిగ్ బాస్ కన్నడ షో షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. బిగ్ బాస్ హౌస్ ని సీజ్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. బిడదిలోని అమ్యూజ్మెంట్ పార్క్ జాలీవుడ్ స్టూడియోలో బిగ్ బాస్ కన్నడ షూటింగ్ జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ ని అక్కడే నిర్మించారు. ఆ స్టూడియో నుంచి నిత్యం 2.5 లక్షల లీటర్ల కలుషితమైన నీరు బయటకి వస్తోందని ఆరోపణలు ఉన్నాయి.

కాలుష్య నియంత్రణ మండలి ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్టూడియో నిర్వాహకులు పట్టించుకోలేదు. దీనితో మంగళవారం రోజు తహసీల్దారు తేజస్విని ఇతర అధికారులతో కలిసి బిగ్ బాస్ హౌస్ ని సీజ్ చేశారు. దీనితో కిచ్చా సుదీప్ హోస్ట్ గా చేస్తున్న షో మధ్యలోనే ఆగిపోయింది.

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చొరవ

అయితే ఈ వివాదంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జోక్యం చేసుకోవడం బిగ్ బాస్ డోర్లు ఓపెన్ అయ్యాయి. పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తూనే వినోద రంగానికి కూడా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో డీకే శివకుమార్ బిగ్ బాస్ డోర్లు ఓపెన్ చేయించారు.

జాలీవుడ్ స్టూడియోకి కలుషిత నీరు విషయంలో చివరి అవకాశం ఇవ్వాలని డీకే శివకుమార్ సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ ని ఆదేశించారు. ఇకపై కూడా స్టూడియో వారు కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. బిగ్ బాస్ తిరిగి ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకున్న డిప్యూటీ సీఎం శివకుమార్ కి కిచ్చా సుదీప్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ బాస్ కన్నడ అభిమానులు డిప్యూటీ సీఎంని ప్రశంసిస్తున్నారు. దటీజ్ డిప్యూటీ సీఎం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

జాలీవుడ్ స్టూడియోకి చివరి అవకాశం

I sincerely thank Hon. @DKShivakumar sir for the timely support. Also want to thank the concerned authorities for acknowledging that #BBK was not involved or was a part of the recent chaos or disturbances. I truely appreciate the DCM for promptly responding to my call, and thank… https://t.co/94n6vh2Boc

— Kichcha Sudeepa (@KicchaSudeep) October 8, 2025

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జోక్యంతో బిగ్ బాస్ కన్నడ తిరిగి ప్రారంభమైంది. అయితే, కాలుష్య నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్టూడియోకి చివరి హెచ్చరిక జారీ చేశారు. వినోదం, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతకు ఇది నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.