|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Devagudi : ‘దేవగుడి’ గ్లింప్స్ రిలీజ్.. ప్రభుత్వ విప్ చేతుల మీదుగా..

Published: 23-09-2025, 6:20 AM

పుష్యం ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘దేవగుడి’ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ విప్ ఆదినారాయణ రెడ్డి మరియు మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డిల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Key Points

1

దేవగుడి సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

2

ఆంధ్రప్రదేశ్ విప్ ఆదినారాయణ రెడ్డి మరియు మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

4

మాండలిక భాషలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

దేవగుడి గ్లింప్స్ లాంచ్ ఈవెంట్

Devagudi : పుష్యం ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవగుడి. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె.. ముఖ్య పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఆంధ్రప్రదేశ్ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెస్టులుగా హాజరయ్యారు.

దేవగుడి గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పిలిచిన వెంటనే ప్రజా సేవలో బిజీగా ఉండి కూడా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా నాయకుల నిబద్ధతను ప్రేరణగా తీసుకొని ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాని తెరకెక్కించాను అని అన్నారు.

ప్రముఖుల సమక్షంలో గ్లింప్స్ విడుదల

మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా మా కడప మాండలికంలో ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని మూవీ యూనిట్ కి ఆల్ ద బెస్ట్ తెలిపారు. విప్ ఆది నారాయణరెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా ఈ సినిమా దర్శకనిర్మాత రామకృష్ణారెడ్డి నాకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి. మా ఊరు పేరుతో ఈ సినిమా టైటిల్ పెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమాకు ఎన్నో బాధ్యతలు వహించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న రామకృష్ణారెడ్డి గారికి ఈ సినిమా మంచి విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

సినిమా యూనిట్ ఆశలు

మొత్తంమీద, దేవగుడి సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ విజయవంతంగా ముగిసింది. ప్రముఖుల ఆశీర్వాదాలతో సినిమాకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.