|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దేవర 2 వెనుక అసలు కథేంటి? కొరటాల రెడీ.. ఎన్టీఆర్ ఎప్పుడు ఫ్రీ?

Published: 07-04-2026, 6:05 AM
దేవర 2 వెనుక అసలు కథేంటి? కొరటాల రెడీ.. ఎన్టీఆర్ ఎప్పుడు ఫ్రీ?
  • దేవర సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇదివరకే ప్రకటన చేశారు.
  • పుష్ప 2 రేంజ్ లో సీక్వెల్ తెరకెక్కిస్తానని కొరటాల శివ హామీ ఇచ్చారు.
  • ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు.
  • స్క్రిప్ట్ పనుల్లో కొరటాల శివ నిమగ్నమయ్యారు, ఎన్టీఆర్ డేట్స్ కోసం ఎదురుచూపులు.

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమాకు సీక్వెల్ రానుంది. అయితే ఈ సినిమా ఆలస్యం కావడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొరటాల శివ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు.

దేవర 2 సీక్వెల్ ఆలస్యం ఎందుకు?

Devara 2: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రం చేసి ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ (Koratala siva) దర్శకత్వంలో చేసిన చిత్రం ‘దేవర’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత సైలెంట్ గా రూ.600 కోట్ల క్లబ్లో చేరి మంచి విజయాన్ని అందించింది. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే.

అసలే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు సీక్వెల్ ఏంటి? అని కొంతమంది పెదవి విరిచారు. కానీ పుష్ప 2 రేంజ్ లో సీక్వెల్ తెరకెక్కిస్తానని హామీ ఇచ్చారు కొరటాల శివ. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. ఇక అన్నట్టుగానే ఈ చిత్ర నిర్మాతలలో ఒకరు ఈ సినిమా షూటింగ్ పై గతంలో అప్డేట్ కూడా ఇచ్చారు .ఇంకా అభిమానులు కూడా దీనికోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కొరటాల శివ కూడా దేవర తర్వాత మరో సినిమాకి కమిట్ కాకుండా దేవర 2 కోసమే పనిచేస్తున్నారు. ఇప్పటికే పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మొదటి భాగం మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో కొరటాల శివ ఈసారి అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది . సీక్వెల్ ను మరింత గ్రిప్పింగ్ గా , ఎమోషనల్ గా తీర్చిదిద్దేందుకు భారీగానే ప్రయత్నం చేస్తున్నారట కొరటాల శివ.

కొరటాల శివ ప్లానింగ్ ఏమిటి?

ఇకపోతే పుష్ప 2 రేంజ్ లో సినిమాను తెరకెక్కిస్తానని గతంలోనే హామీ ఇచ్చారు కాబట్టి అందుకు తగ్గట్టుగా కథలోని ప్రతి సన్నివేశం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి అని, అందులో భాగంగానే స్క్రిప్ట్ కి మరిన్ని మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.. అయితే అంతా ఓకే కానీ మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయానికి వస్తే.. ఇది పూర్తిగా ఎన్టీఆర్ చేతుల్లోనే ఉందని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమాకి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అందుకే అసలు డ్రాగన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి.. ఒకవేళ ఈ సినిమా పూర్తి చేసుకుని ఎన్టీఆర్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తే అప్పుడే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది.

ఎన్టీఆర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తారు?

మొత్తానికైతే షూటింగ్ డేట్స్ కనుక ఖరారు అయితే ఈ సినిమా నిర్మాణ పనులు చాలా వేగంగా పూర్తవుతాయి. అయితే ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం మే 20 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. అందుకే దేవర 2 అనౌన్స్మెంట్ తో పాటు ప్రశాంత్ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ కి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా డ్రాగన్ తో పాటు కోసం దేవర 2 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి మే 20న ఏ సినిమా అప్డేట్ ప్రేక్షకులలో అంచనాలు పెంచుతుందో చూడాలి.

మొత్తానికి దేవర 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ డేట్స్ ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.