|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Devara Part 1: దేవర సూపర్ హిట్‌ సాంగ్‌.. ఆ క్రెడిట్ అంతా మీకేనా?

Published: 29-08-2025, 4:18 AM
Devara Part 1: దేవర సూపర్ హిట్‌ సాంగ్‌.. ఆ క్రెడిట్ అంతా మీకేనా?

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ 1 సినిమాలోని ‘చుట్టమల్లే చుట్టేస్తావే’ పాట సూపర్ హిట్ అయింది. ఈ పాట విజయానికి కొరియోగ్రాఫర్ల కృషిని గుర్తించాలని బోస్కో మార్టిస్ కోరుతున్నారు.

Key Points

1

దేవర సినిమాలోని 'చుట్టమల్లే చుట్టేస్తావే' సాంగ్‌కు అద్భుతమైన ఆదరణ లభించింది.

2

సాంగ్‌ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్, కొరియోగ్రాఫర్లకు సరైన గుర్తింపు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

4

కొరియోగ్రాఫర్ల బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాలని బోస్కో మేకర్స్‌ను కోరారు.

సుపర్ హిట్ దేవర సాంగ్

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ డైరెక్షన్ ‌ లో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్ -1. ఈ మూవీ గతేడాది సెప్టెంబర్‌ 27న రిలీజై సూపర్ ‌ హిట్ ‌ ను సొంతం చేసుకుంది . సముద్రం బ్యాక్ ‌ డ్రాప్ ‌ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది . ఈ విజయంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ చేసుకున్నారు . అయితే ఈ సినిమా ఎంత సక్సెస్ ‌ అయిందో .. అంతే రేంజ్ ‌ లో ఆ సాంగ్ ‌ కూడా ఫుల్ ‌ క్రేజ్ దక్కించుకుంది . ఎక్కడా చూసిన ఆ పాటే వినిపించేది . రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ ‌ స్థాయి వ్యూస్ ‌ ను సొంతం చేసుకుంది .

‘ చుట్టమల్లే చుట్టేస్తావే ‘ అంటూ వచ్చిన దేవర సాంగ్ ‌ కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది . ఈ రొమాంటిక్ ‍ సాంగ్ జూనియర్ ఫ్యాన్స్ ‌ ను ఓ ఊపు ఊపేసింది . ఇందులో తారక్‌, జాన్వీ కపూర్‌ల కెమిస్ట్రీ అభిమానులను తెగ ఆకట్టుకుంది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించారు. శిల్పరావు గాత్రం ఈ రొమాంటిక్‌ మెలోడీని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

కొరియోగ్రాఫర్ల ఆవేదన

తాజాగా ఇలాంటి పాటలకు వచ్చే క్రెడిట్ తమకు ఇవ్వడం లేదని దేవర సాంగ్‌ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . పాట విడుదలైన తర్వాత కొరియోగ్రాఫర్ల పేర్లను పూర్తిగా విస్మరించడం సరికాదంటున్నారు . సాంగ్ పూర్తయ్యాక కొరియోగ్రాఫర్లను మరిచిపోవడం సాధారణంగా మారిపోయిందన్నారు . ఇక్కడ నాకు క్రెడిట్ ఇవ్వలేదని కాదు .. నేను కాకుండా మరో బ్రాండ్ ‌ ఉన్న కొరియోగ్రాఫర్ అయితే కచ్చితంగా వారి పేర్లు వేసేవాళ్లన్నారు . పాటలకు పనిచేసిన కొరియోగ్రాఫర్ల బ్రాండ్ ‌ ను దెబ్బ తీయవద్దని మేకర్స్ ‌ ను కోరారు .

గుర్తింపు కోసం డిమాండ్

బోస్కో మాట్లాడుతూ .. ‘ పాట విడుదలైన తర్వాత కొరియోగ్రాఫర్‌ను మరచిపోతారు. మా కష్టాన్ని ఇతరులకు క్రెడిట్ ఇస్తారు. కానీ ఇప్పుడు కూడా పాట విడుదలైనప్పుడు కొన్నిసార్లు కొరియోగ్రాఫర్ పేర్లను కూడా చూస్తున్నాం . కానీ కొందరు మాత్రం కొరియోగ్రాఫర్ పేరును ఎప్పుడూ ఉంచరు. వారు ఎల్లప్పుడూ ఆ మూవీ స్టార్ ‌ పేరునే ఉంచుతారు . ఒక స్టార్‌కు ఎంత గొప్పగా పేరు వస్తే .. కొరియోగ్రాఫర్‌కు కూడా అంతే గొప్పగా రావాలని కోరుకుంటున్నా. సంగీత దర్శకుడికి ఎంత పేరు వస్తుందో .. సింగర్ ‌ కు కూడా అంతే క్రెడిట్ దక్కాలి . నాకు రాకపోయినా.. నా తర్వాత వచ్చే కొత్తతరానికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా ‘ అని అన్నారు . కాగా .. దేవర సినిమా ఈ మూవీ రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు.

దేవర సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ, కొరియోగ్రాఫర్లకు తగిన గుర్తింపు లేకపోవడం బాధాకరం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.