|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Devara Part 2: దేవర-2.. పవర్‌ఫుల్‌ రోల్‌ కోసం స్టార్‌ హీరో!

Published: 30-09-2025, 5:17 AM
Devara Part 2: దేవర-2.. పవర్‌ఫుల్‌ రోల్‌ కోసం స్టార్‌ హీరో!

జూనియర్‌ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర పార్ట్‌-1 బ్లాక్ బస్టర్‌ విజయం సాధించడంతో, పార్ట్‌-2 పనులు వేగవంతం అయ్యాయి. దేవర-2లో కీలకమైన పవర్‌ఫుల్‌ రోల్‌ కోసం తమిళ స్టార్‌ శింబును అనుకుంటున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం కోలీవుడ్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది.

Key Points

1

జూనియర్‌ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో దేవర పార్ట్‌-1 బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

2

దేవర-2 కోసం స్క్రిప్ట్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

4

శింబుతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దేవర-1 భారీ విజయం

జూనియర ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్‌ చిత్రం దేవర పార్ట్‌-1. గతేడాది దసరా సందర్భంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో మెప్పించారు. సముద్రం బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించింది.

దేవర-2 స్క్రిప్ట్ పనులు

దేవర సూపర్ హిట్ కావడంతో పార్ట్-2 కూడా ఉంటుందని కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ కోసం ప్లాన్‌ రెడీ చేస్తున్నారు. దాదాపు స్క్రిప్ట్‌ అంతా ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేవర-2కు సంబంధించిన నెట్టింట ఓ బజ్‌ నడుస్తోంది. పార్ట్-2 కోసం ఓ పవర్‌ఫుల్ రోల్‌ను కొరటాల క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రోల్‌లో తమిళ స్టార్‌ శింబును అనుకుంటున్నట్లు లేటేస్ట్ టాక్.

పవర్‌ఫుల్‌ రోల్‌లో శింబు?

‍అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కథలో బలమైన ప్రభావం చూపించేలా దేవర-2 స్క్రిప్ట్‌లో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. శింబు అయితే ఈ పవర్‌ఫుల్ రోల్‌కు సెట్ అవుతాడని కొరటాల అతని వైపే మొగ్గు చూపుతున్నారని టాక్. ఈ విషయంపై ప్రస్తుతం అతనితో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదేమైనా దేవర-2 రోల్‌ కోసం శింబు పేరు తెరపైకి రావడంతో కోలీవుడ్ ఫ్యాన్స్‌ సైతం ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దేవర-2లో శింబు వంటి స్టార్‌ భాగమైతే సినిమాకు మరింత బలం చేకూరుతుంది. ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన కోసం ఎన్టీఆర్, శింబు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.