
📌 Key Points
- దేవిశ్రీ ప్రసాద్, రామ్ చరణ్ – సుకుమార్ కాంబో సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఈ వార్త ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపింది.
- పుష్ప 2 సమయంలో సుకుమార్, దేవిశ్రీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ పుకార్లకు చెక్ పెట్టిన డీఎస్పీ. ఇది శుభవార్త.
- గతంలో ఎన్నో చార్ట్‌బస్టర్‌లు అందించిన బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఇది. మళ్లీ మ్యాజిక్ రిపీట్ కానుంది.
- మాస్ ఆడియన్స్ కోసం అదిరిపోయే మ్యూజిక్ ట్రీట్ ఖాయం. రికార్డులు బద్దలవడం గ్యారంటీ.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ వార్త ఫ్యాన్స్‌లో అంచనాలను అమాంతం పెంచేస్తోంది. మరిన్ని వివరాల కోసం చదవండి!
చెర్రీ-సుక్కు-దేవిశ్రీ.. మాస్ కాంబో రీఎంట్రీ!
Devi Sri Prasad : డైరెక్టర్‌గా సుకుమార్ అన్ని సినిమాలకు మ్యూజిక్ అందించింది డీఎస్పీనే ! ఇద్దరి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. పుష్క ఫ్రాంచైజీ అయితే.. ఇండియావైడ్‌గా మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఐతే పుష్ప 2 టైమ్‌లో ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.
పుష్ప 2 గాసిప్స్.. బ్రేక్ చేసిన దేవిశ్రీ!
ఐతే అదంతా ఉట్టి గాసిప్పే అని ఇప్పుడు తేలిపోయింది. పెద్ది తర్వాత రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో ఓ మూవీకి సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ డైరెక్ట్‌గా మళ్లీ దేవిశ్రీప్రసాద్ పేరే బలంగా వినిపిస్తోంది. పెద్ది సినిమాకు రెహమాన్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ.. ఆ ఆల్బమ్ అంచనాలకు తగ్గ రీచ్ సాధించలేదనే ఓపీనియన్ ఇండస్ట్రీలో ఉంది.
రికార్డులు బద్దలు కొట్టే మ్యూజిక్ సిద్ధం!
దీంతో సుకుమార్ కూడా.. తన టేస్ట్‌కు సరిపోయే.. వైబ్‌తో మ్యాచ్ అయ్యే దేవిశ్రీప్రసాద్‌తోనే మళ్లీ పని చేయాలని డిసైడ్ అయ్యాడని టాక్. గతంలో ఎనర్జిటిక్ మ్యూజిక్, చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో ఊపు ఊపిన ఈ కాంబో.. మళ్లీ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని ఫిక్స్ అయిందట. దీంతో చెర్రీ, సుక్కు, రాక్ స్టార్ మూవీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
చెర్రీ, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమా మ్యూజిక్ పరంగా భారీ సంచలనం సృష్టించడం ఖాయం. ఈ బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ గురించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి!


