|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dhanush : ఈ సినిమాలో అసలు ఎవరు నటించారో కూడా నాకు తెలీదు.. ధనుష్ కామెంట్స్.. (కుబేర)

Published: 15-06-2025, 1:16 PM
Dhanush : ఈ సినిమాలో అసలు ఎవరు నటించారో కూడా నాకు తెలీదు.. ధనుష్ కామెంట్స్.. (కుబేర)

నాగార్జున మరియు ధనుష్ జంట నటనలో తెరకెక్కుతున్న ‘కుబేర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో ధనుష్ చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాలోని నటీనటుల గురించి ధనుష్ ఏమన్నారో చూద్దాం.

Key Points

1

నాగార్జున, ధనుష్ జంట నటనలో 'కుబేర' సినిమా

2

కుబేర సినిమా జూన్ 20న విడుదల

4

కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్, రాజమౌళి వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి

కుబేర ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

Dhanush : నాగార్జున – ధనుష్ మల్టీస్టారర్ గా రష్మిక మందన్న ముఖ్య పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కుబేర. ఈ సినిమా జూన్ 20 రిలీజ్ కాబోతుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా హాజరయ్యారు.

ధనుష్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు

ఈ ఈవెంట్లో ధనుష్ మాట్లాడుతూ.. నేడు ఫాదర్స్ డే. మా నాన్న నా కంటే ఎక్కువ కష్టపడి మా కోసం చాలా చేసాడు. ఇది తెలుగులో సర్ కంటే ముందు ఒప్పుకున్న సినిమా. తెలుగులో నాకు ఇది రెండో సినిమా. తమిళ్ లో 51వ సినిమా. శేఖర్ కమ్ముల గారికి ఆరోగ్యం బాగోకపోయినా చాలా కష్టపడ్డారు. డబ్బులను, కలెక్షన్స్ ని మించి కొన్ని సినిమాలు ఉంటాయి. ఈ సినిమా అలాంటిది. నాకు ఈ సినిమాలో చాలామంది నటిస్తున్నారని తెలీదు. ఇప్పుడు ట్రైలర్ చూసాక వీళ్లంతా యాక్ట్ చేసారా అని ఆశ్చర్యపోతున్నా. నేను నటించిన సీన్స్ లో ఉన్న వాళ్ళు కాకుండా వేరేవాళ్లు అసలు ఎవరు నటించారు కూడా నాకు తెలీదు. నాగార్జున గారి సినిమాలు చూస్తూ పెరిగి ఇప్పుడు మీతో నటించడం గర్వంగా అంది. మా సిస్టర్స్ కి మీరంటే కృష్ అని అన్నారు.

నాగార్జున – ధనుష్ కలయిక

కుబేర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంచనాలను అందుకుని, ధనుష్ వ్యాఖ్యలతో సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. జూన్ 20న విడుదల అవుతున్న ఈ సినిమా విజయవంతం అవుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.