|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dhanush: ‘మీరెన్ని కుట్రలు చేసినా నన్ను ఆపలేరు’.. ధనుశ్ ఎమోషనల్ కామెంట్స్! (కుబేరా)

Published: 01-06-2025, 10:19 PM
Dhanush: 'మీరెన్ని కుట్రలు చేసినా నన్ను ఆపలేరు'.. ధనుశ్ ఎమోషనల్ కామెంట్స్! (కుబేరా)

కోలీవుడ్ నటుడు ధనుష్ నటించిన కుబేరా సినిమా ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న నెగెటివ్ ప్రచారం గురించి ఆయన స్పందించారు.

Key Points

1

ధనుష్ కుబేరా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

2

సినిమాపై వస్తున్న నెగెటివ్ ప్రచారంపై ధనుష్ స్పందించారు.

4

కుబేరా సినిమా సూపర్ హిట్ అవుతుందని ధనుష్ ధీమా వ్యక్తం చేశారు.

కుబేరా సినిమా ప్రమోషన్ ఈవెంట్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ప్రస్తుతం కుబేరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్‌గా రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.  ఈ మూవీని అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు.

ఇకపోతే ఈ మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కోలీవుడ్‌లో తనపై వస్తున్న నెగెటివ్ ప్రచారంపై ధనుశ్ స్పందించారు.

నెగెటివ్ ప్రచారంపై ధనుష్ స్పందన

తన రాబోయే సినిమాపై వస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని, రూమర్స్‌ను హీరో ధనుశ్ ఖంండిచారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఇలాంటి కుట్రపూరిత ప్రచారం తనను ఎలాంటి ప్రభావితం చేయదని అన్నారు. ఎవరెన్ని చేసినా తనను ఏం చేయలేరని.. నా రియల్‌ అభిమానులు తనపై వచ్చిన ప్రతికూలతను హ్యాండిల్‌ చేస్తారని స్పష్టం చేశారు. నా సినిమా రిలీజ్‌కు నెల రోజులు ఉండగానే మీరు ఎంత నెగెటివ్‌ ప్రచారం చేసినా ఏం చేయలేరంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు. తమిళ చిత్ర పరిశ్రమలో తన పోటీదారులు చేసిన పరోక్ష వ్యాఖ్యలకు ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అభిమానులపై ధనుష్ నమ్మకం

ధనుష్ మాట్లాడుతూ.. “మీరు నాపై ఎంత నెగెటివ్ ప్రచారమైనా చేసుకోండి. కానీ నా సినిమా విడుదలకు ముందు దేనినీ ఆపలేరు. ఎందుకంటే నా అభిమానులు నాతో ఉన్నారు. నా గురించి నెగెటివ్ వ్యాఖ్యలు చేసే మీరు.. దయచేసి పక్కకెళ్లి ఆడుకోండి. ఎందుకంటే మాకు ఇలాంటి సర్కస్ వద్దు. ఇక్కడి ప్రజలు.. కేవలం నా అభిమానులు మాత్రమే కాదు.. వారు నా సహచరులు.. 23 సంవత్సరాలుగా నాతో ఉన్న నా సహచరులు. నాపై రూమర్స్‌ ప్రచారం చేసిన నన్ను అడ్డుకుంటామని మీరు అనుకుంటే.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. అభిమానులారా.. మీరు కోరుకున్న విధంగా జీవితాన్ని గడపండి. గతంలో నేను చాలా ఇబ్బందులు పడ్డా. ఈ రోజు మంచి స్థితిలో ఉన్నా. పరిస్థితి ఎలా ఉన్నా నేను సంతోషంగా ఉంటాను. ఈ ప్రపంచానికి ‘కుబేర’ లాంటి సినిమా అవసరం. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది. ‘అంటూ భావోద్వేగ కామెంట్స్ చేశారు.

ధనుష్ తన అభిమానులపై అపారమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, కుబేరా సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నెగటివ్ ప్రచారంపై అతని స్పందన ఆయన ధైర్యాన్ని చాటుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.