
తమిళ సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్! ధనుష్ మరియు కార్తి తమ కొత్త సినిమాల అప్డేట్లను ఒకే రోజున వెల్లడించారు. ‘D54’ మరియు ‘మార్షల్’ సినిమాల పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Key Points
ధనుష్ కొత్త సినిమా 'D54' షూటింగ్ ప్రారంభం.
కార్తి కొత్త సినిమా టైటిల్ 'మార్షల్' గా ప్రకటన.
రెండు సినిమాల పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్.
ఒకే రోజున ఇద్దరు స్టార్ హీరోల నుండి గుడ్ న్యూస్.
ధనుష్ ‘D54’ సినిమా ప్రారంభం
తమిళ స్టార్ హీరోలు ధనుష్, కార్తి ఒకే రోజు తమ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. తమ కొత్త సినిమాల అప్ డేట్స్ అందించారు. గురువారం (జూలై 10) అదిరిపోయే న్యూస్ చెప్పారు. సోషల్ మీడియా వేదికలకు తమ కొత్త సినిమాల కబుర్లను అందించారు. ఇందులో కార్తి తన సినిమా పేరును కూడా అనౌన్స్ చేశాడు.
కుబేర లాంటి సూపర్ హిట్ తర్వాత తమిళ హీరో ధనుష్ చేయబోయే ప్రాజెక్ట్ పై అంచనాలు నెలకొన్నాయి. ఆయన ఎవరితో సినిమా చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు ధనుష్ తెరదించారు. విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో ధనుష్ మూవీ చేయబోతున్నారు. డీ54 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. దీనికి జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్. పోర్ తోజిల్ మూవీతో యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ రాజా పాపులర్ అయ్యారు.
కార్తి ‘మార్షల్’ సినిమా ప్రకటన
డీ54 మూవీ షూటింగ్ ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాప్ డైరెక్టర్ వెట్రిమారన్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ధనుష్, విఘ్నేష్ రాజా కాంబినేషన్లో మూవీని వెల్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. కొత్త సినిమా అప్ డేట్ ను ‘డీ54 ఓం నమశివాయా’ అనే క్యాప్షన్ తో పోస్టర్ ను పోస్టు చేశాడు ధనుష్.
మరో తమిళ్ స్టార్ హీరో కార్తి కొత్త సినిమా టైటిల్ ను గురువారం రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘మార్షల్’ అనే పేరు పెట్టారు. తమిజ్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. కార్తి సరసన కల్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ పోస్టర్లు
‘‘డియర్ ఫ్రెండ్స్, మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో ఓ కొత్త అడుగు ముందుకు వేస్తుంది. మార్షల్ ఈ రోజే మొదలవుతుంది’’ అని కార్తి ఎక్స్ లో పోస్టు చేశాడు.
కార్తి కొత్త సినిమా ‘మార్షల్’ కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. కొత్త పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో కోస్టల్ విలేజ్ కనిపిస్తోంది. కానీ పోస్టర్ లో కార్తి ముఖం కనిపించలేదు. ఈ సినిమాలో కార్తి, కల్యాణి ప్రియదర్శన్, సత్యరాజ్, ప్రభు, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం సర్దార్ 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న కార్తి.. ఇప్పుడు ఏకకాలంలో మార్షల్ ను కూడా కంప్లీట్ చేయబోతున్నాడు.
ధనుష్ మరియు కార్తి ఇద్దరు తమ కొత్త ప్రాజెక్టులతో అభిమానులను అలరించారు. ‘D54’ మరియు ‘మార్షల్’ సినిమాల విజయవంతమైన ప్రయాణం కోసం ఆశిద్దాం.


